Drumstick leaves soup: సీజనల్ వ్యాధులు (seasonal diseases) విజృంభిస్తూనే ఉన్నాయి. వాటిని మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. మరోవైపు కరోనా.. ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీ బూస్టింగ్ (immunity boost) సరైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు మునగాకు (drumstick leaves) తో తయారు చేసే పోషకమైన ఆకుకూర. ఇది సహజంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, నిత్రలేమికి సహాయపడుతుంది.
శరీరంలోని చెడు నీటిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఈ మునగాకు (drumstick leaves) ఆకు పులుసు గొంతునొప్పి, జలుబు, అజీర్తికి కూడా మంచి ఔషధం. దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం.
మునగాకు సూప్‌కు కావాల్సిన పదార్థాలు..
ముగన ఆకు– 11/2 కప్పులు
బియ్యం నీరు– 2 టేబుల్ స్సూన్లు
సాంబార్ ఉల్లిపాయలు–5 టమాట–1
పచ్చిమిర్చి–1
కొబ్బరి పాలు– 1 టేబుల్ స్పూన్
జీలకర్ర– 1 టేబుల్ స్పూన్
మిరియాలు– 1/2 టేబుల్ స్పూన్స్
ఉప్పు– తగినంత.
రెసిపీ తయారీ విధానం..
ముందుగా బియ్యం నీటిని ఓ పాత్రలో పోసి మరిగించాలి.
బాగా ఉడికిన తర్వాత..శుభ్రంగా కడిగిన ముగగ ఆకు వేసి కలపాలి. కాసేపటి తర్వాత ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి వేసుఏకోవాలి.
ఇది కూడా చదవండి: మీకు తెలుసా? ఈ పండు తింటే.. బట్టతల రాదు!
ఆ తర్వాత మూత పెట్టి మునగ ఆకులు ఉడికినంత వరకు తక్కువ మంట మీద రెసిపీని ఉడకనివ్వాలి. మునగాకు ఉడికిన తర్వాత కొబ్బరిపాలలో కొద్దిగా కారం, జీలకర్ర వేసి, అవసరమైనంత ఉప్పు వేసి 5 నిమిషాలు మరిగించాలి.
మసాలా కోసం బాణలిలో నూనె వేసి అది వేడైన తర్వాత జీలకర్ర, మిగతా దినుసులు వేసుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి ఈ సూప్‌ను కాస్త వేడిగా ఉన్నపుడే తాగండి . వీటితో జలుబు, గొంతునొప్పి, దుగ్గుకు చెక్ పెట్టొచ్చు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Immunity