Hypothyroidism: థైరాయిడ్ సమస్యలతో జాగ్రత్త.. మహిళలకు నిపుణులు ఇస్తున్న సూచనలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

Hypothyroidism: భారత్‌లో ఎనిమిది నగరాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. మూడింట ఓ వంతు జనాభా హైపోథైరాయిడిజంతో బాధపడుతుందని తేలింది. చాలా మంది ఈ రోగ నిర్ధారణ సైతం చేయించుకోవట్లేదని సర్వేలో తేలింది.

  • Share this:
మానవ శరీరంలో థైరాయిండ్ గ్రంథి ఎన్నో కీలక విధులను నిర్వరిస్తుంది. ముఖ్యంగా జీవక్రియ రేటు (metabolism) మెరుగ్గా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెడ భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి.. శరీరంలో శక్తి స్థాయిలను పెంచడంతో పాటు బరువు, హృదయ స్పందన, మూడ్ నిర్వహన వంటి అనేక విధులను నిర్వహిస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను ఉతత్తి చేస్తుంది. అయితే ఈ గ్రంథి తగినంత థైరాయిడ్ హారోన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడాన్ని 'హైపోథైరాయిడిజం' అంటారు. ఇది ఇతర వ్యాధులకు దారితీస్తుంది. ప్రస్తుతం చాలా మంది థైరాయిండ్ సమస్యలను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇతర సంక్రమించని వ్యాధుల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. తాజాగా భారత్‌లో ఎనిమిది నగరాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. మూడింట ఓ వంతు జనాభా హైపోథైరాయిడిజంతో బాధపడుతుందని తేలింది. చాలా మంది ఈ రోగ నిర్ధారణ సైతం చేయించుకోవట్లేదని సర్వేలో తేలింది.

థైరాయిడ్ సమస్యల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముంబయిలో 35 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న పెద్దలు, గర్భిణులు, మధ్య వయసు ఉన్న మహిళల్లో థైరాయిడ్ సమస్యలు అధికంగా వస్తున్నాయని ఒక అధ్యయనం తెలిపింది. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే అదనపు సమస్యలు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. హైపోథైరాయిడిజం.. డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ప్రారంభ దశలో దీన్ని గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చు. మహిళల్లో ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు అధికంగా వస్తున్నందువల్ల.. వారు ముఖ్యంగా నాలుగు అంశాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

1. పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ..
హైపోథైరాయిడిజం అనేది మహిళల్లో చాలా సాధారణంగా వస్తున్న సమస్య. అన్ని వయస్కుల వారికి థైరాయిడ్ సమస్య వస్తున్నప్పటికీ ముఖ్యంగా పిల్లలను కనే వయస్సులో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రమాద కారకాలు అధికంగా ఉన్న మహిళలు హైపోథైరాయిడిజానికి సంబంధించి ప్రత్యేక స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఈ కారకాల్లో మోడరేట్ సివియర్ అయోడిన్ లోపం, స్థూలకాయం, థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల గాయిటర్ సమస్య, గ్రర్భ స్రావాలు కావడం, ప్రీటర్మ్ డెలివరీ, వ్యంధత్వం లేదా స్వయం ప్రతి రక్షక వ్యాధుల ఉన్న ప్రాంతంలో నివసించడం లాంటివి అధిక ప్రమాదాలకు దారితీస్తాయి.

2. అంతుచిక్కని సంకేతాలు, లక్షణాలు..
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు సైలెంట్‌గా బాధపడకూడదు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆరోగ్యం బాగా క్షీణించినప్పుడు లేదా సమస్య తీవ్రమైనప్పుడే వైద్యుడిని సంప్రదిస్తారు. హైపోథైరాయిడిజం లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. పెద్దగా పట్టించుకోరు. వీటిలో అలసట, అధిక బరువు పెరగడం, మలబద్దకం, పొడి చర్మం, జలుబు, బద్ధకం, కండరాల తిమ్మిరి, కనురెప్పలు ఉబ్బడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇతర వ్యాధులు ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ఇవి మన దైనందిన జీవితంలో సాధారణంగా కనిపిస్తాయి. కాబట్టి ఎక్కువ కాలం వేచి ఉండకుండా మీకు స్క్రీనింగ్ కు వెళ్లడం అవసరం. లక్షణాలను తగ్గించుకునేందుకు ముందుగానే చర్య తీసుకోవాలి.

3. ఆరోగ్య సమస్యలు.. అదనపు ప్రమాదం..
థైరాయిడ్ సమస్యలు వల్ల కేవలం జుట్టు నష్టం, బరువు హెచ్చుతగ్గుల కంటే ఎక్కువ పరిణామాలు ఉంటాయి. చికిత్స చేయించుకోకపోతే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, డిప్రెషన్, క్రమరహిత రుతు చక్రం నుంచి వ్యంధత్వం వరకు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. మోనోపాజ్ లక్షణాలు కలిగించే అవకాశముంది. ఇవి కాకుండా హృదయ, నాడీ సంబంధిత సమస్యలకు, మధుమేహానికి దారితీయవచ్చు.

4. తల్లీ, బిడ్డల ఆరోగ్యం కోసం సకాలంలో చికిత్స..
హైపోథైరాయిడిజం గర్బిణీ స్త్రీలల్లో ఆందోళనలను కలిగిస్తుంది. గర్భదారణ సమయంలో హైపోథైరాయిడిజం వల్ల రక్తహీనత, గర్భస్రావం, ప్రసవానంతర రక్తస్రావం, ప్రీ ఎక్లంప్సియా, ఎనిమియా మిస్ క్యారేజ్ లాంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి సకాలంలోనే చికిత్స తీసుకోవడం ముఖ్యం.
థైరాయిడ్ హార్మోన్ కడుపులో పిండం మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి కీలకం. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో పిండం తల్లి హార్మోన్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది.

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ప్రీ-టర్మ్ బర్త్(ముందుగానే ప్రసవించడం), తక్కువ బరువుతో బిడ్డ జననం లాంటి ప్రమాదాలను పెంచుతాయి. ఇందుకోసం గర్భధారణ ముందు, అనంతరం రెండు సమయాల్లోనూ స్క్రీనింగ్ చేయించుకోవడం తల్లి, బిడ్డల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. హైపోథైరాయిడిజం సమస్య ఉన్న మహిళలు తమ ఎండోక్రినాలజిస్టును సంప్రదించి పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి.
Published by:Sridhar Reddy
First published: