హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Rectal Cancer: క్యాన్సర్‌ చికిత్సలో కీలక ఆవిష్కరణ.. మహమ్మారికి చెక్ పెట్టే మెడిసిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

Rectal Cancer: క్యాన్సర్‌ చికిత్సలో కీలక ఆవిష్కరణ.. మహమ్మారికి చెక్ పెట్టే మెడిసిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పేగు క్యాన్సర్‌ (Rectal Cancer) నివారణకు చేపట్టిన పరిశోధనలు అద్భుత ఫలితాలనిచ్చినట్లు తేలింది. దీనిపై ఒక మెడిసిన్ సమర్థంగా పనిచేస్తుందని రిసెర్చర్లు గుర్తించారు. ఈ పరిశోధన, మెడిసిన్ గురించి మరిన్ని వివరాలు..

క్యాన్సర్‌(Cancer).. ప్రపంచంలో ఎంతో మందిని పొట్టనపెట్టుకుంటున్న మహమ్మారి. ఈ ప్రాణాంతక రోగానికి సంపూర్ణ చికిత్స అందించేందుకు ఏళ్లుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అత్యంత ప్రమాదకరమైన పేగు క్యాన్సర్‌ (Rectal Cancer) నివారణకు చేపట్టిన పరిశోధనలు అద్భుత ఫలితాలనిచ్చినట్లు తేలింది. దీనిపై ఒక మెడిసిన్(Medicine) సమర్థంగా పనిచేస్తుందని రిసెర్చర్లు(Researchers) గుర్తించారు. ఈ పరిశోధన, మెడిసిన్(Medicine) గురించి మరిన్ని వివరాలు..

అద్భుత ఔషధం..ఎంతవరకు నిజం?

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కొలొరెక్టల్ క్యాన్సర్(Cancer) కణాలను నాశనం చేసే డోస్టార్లిమాబ్‌(Dostarlimab) ఔషధాన్ని అభివృద్ధి(Develop) చేశారు. దీనిని కొలెరెక్టల్ క్యాన్సర్ తో(cholesterol cancer)  బాధపడుతున్న 18 మంది రోగులపై ప్రయోగించారు. వీరందరిలో కీమోథెరపీ/సర్జరీ అవసరం లేకుండానే ఈ క్యాన్సర్ నయమవుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి క్యాన్సర్ చికిత్సలో దీనిని వండర్ డ్రగ్ గా అభివర్ణిస్తున్నారు.

Dostarlimab ప్రభావవంతమైనదేనా?

వాస్తవానికి డోస్టార్లిమాబ్‌(Dostarlimab)అనేది కొత్త ఔషధమేనీ కాదు. ఇమ్యునోథెరపీలో ఉపయోగించేందుకు ఇప్పటికే ఆమోదం పొందిన డ్రగ్ కాంబినేషన్. రెక్టల్ క్యాన్సర్(RECTAL CANCER) రోగుల్లో డోస్టార్లిమాబ్‌(Dostarlimab) మరింత ప్రభావం చూపించే అవకాశం ఉందని మ్యాక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ ఛైర్మన్ డాక్టర్ హరిత్ చతుర్వేది అన్నారు.

భారత్ లో అందుబాటులో ఉందా?

ప్రస్తుతం డోస్టార్లిమాబ్‌(Dostarlimab) ఔషధాన్ని రోగులకు సూచించేందుకు భారతీయ వైద్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుత ఫలితాల పట్ల ఆశాజనకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెక్టల్ క్యాన్సర్ రోగులు(Patients) ఆరు నెలల(Six Months) పాటు ఈ ఔషధాన్ని తీసుకున్న తర్వాత క్యాన్సర్ సంకేతాలు లేవని, వారిలో ఎవరికీ తీవ్రమైన దుష్ప్రభావాలు కలగలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ భారతీయ వైద్యులు మరింత వేచిచూడాలనుకుంటున్నట్లు డాక్టర్ చతుర్వేది చెప్పారు. అయితే దీనికి సంబంధించి భారతదేశంలో ట్రయల్స్ ప్రారంభమైతే.. రోగులకు ఈ ఔషధం గురించి వివరించి పరిశోధనలు జరుపుతామని పేర్కొన్నారు.

క్లినికల్ ట్రయల్స్.. అందుబాటులో ఉన్న సమాచారమెంత?

USA మాన్‌హట్టన్‌ మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్‌లోని 18 మంది కొలెరెక్టల్ క్యాన్సర్ రోగులపై జరిపిన పరిశోధనలో పాల్గొన్నవారందరికీ ఎండోస్కోపీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ/మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(MRI) స్కానింగ్ లో క్యాన్సర్ కణాల ఆనవాళ్లు కనిపించలేదు. అందుకే క్యాన్సర్‌కు కీమోథెరపీ/శస్త్రచికిత్స లేకుండానే చికిత్స చేయొచ్చని వైద్య ప్రపంచం భావిస్తోంది.

Govt Jobs 2022: డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిని వారికి బెస్ట్ చాన్స్.. నెలకు రూ.18,000 వేతనంతో అప్రెంటీస్ జాబ్స్

రెక్టల్ క్యాన్సర్ డేంజరా?

గ్లోబోకాన్-2020 నివేదిక ప్రకారం.. 2020లో భారతదేశంలో నమోదైన మొత్తం క్యాన్సర్ కేసుల సంఖ్య 13 లక్షలు. వీటిలో 65,358 కొలెరెక్టల్ క్యాన్సర్ కేసులు. సాలిడ్ ట్యూమర్ రెక్టల్ క్యాన్సర్ రోగులకు ఆంకాలజిస్టులు శస్త్రచికిత్స అందిస్తారు. మల క్యాన్సర్ రకాన్ని బట్టి రెండు విధాలుగా చికిత్సా అందిచొచ్చు. ఒకటి కీమో, రేడియేషన్‌ను అందించడం. మరొకటి శస్త్రచికిత్స.

AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

క్యాన్సర్ చికిత్సలో డోస్టార్లిమాబ్‌ కీలకం కానుందా?

ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ ఔషధం క్యాన్సర్ చికిత్సలో భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేస్తోంది. అయితే ఇతర క్యాన్సర్‌లు కలిగిన ఎక్కువ మంది రోగులను పరీక్షించాల్సిన అవసరం ఉందని పాట్నా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(AIIMS) రేడియేషన్ ఆంకాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ శంకర్ చెబుతున్నారు.

First published:

Tags: Cancer, Health, Health benefits, Lifestyle, Treatment

ఉత్తమ కథలు