Home /News /life-style /

HEALTH 7 LIFESTYLE HABITS THAT ARE HURTING YOUR KIDNEYS UMG GH

Kidney Health: ఈ అలవాట్లు ఉన్నాయా..? మానేయకపోతే మీ కిడ్నీల గతి అధోగతే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్నిరకాల జీవనశైలి అలవాట్ల కారణంగా కిడ్నీ (Kidney)ల పనితీరు దెబ్బతిని, అవి వైఫల్యం చెందవచ్చు. ఆ అలవాట్లు (Habits) ఏవో పరిశీలిద్దాం. 

మనం ఆరోగ్య (Health) సంరక్షణలో కిడ్నీ (Kidney)ల పాత్ర ఎంతో కీలకం. శరీరంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయడంతో పాటు శరీరంలోని నీరు, లవణాలు, ఖనిజాలను సమతుల్యతలో ఉంచడానికి యాసిడ్‌ను కూడా తొలగిస్తుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకపోతే, శరీరంలోని న్యూరాన్లు, కండరాలు, ఇతర కణజాలాలు పనిచేయకపోవచ్చు. ఫలితంగా కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్నిరకాల జీవనశైలి అలవాట్ల కారణంగా కిడ్నీల పనితీరు దెబ్బతిని, అవి వైఫల్యం చెందవచ్చు. ఆ అలవాట్లు (habits) ఏవో పరిశీలిద్దాం.

విటమిన్స్ లోపం ఉన్న ఆహారం తీసుకోవడం
కొన్ని విటమిన్లు కిడ్నీలకు ప్రయోజనకరంగా ఉంటాయి. అవి లోపిస్తే కిడ్నీలకు నష్టం జరగవచ్చు. కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో విటమిన్ డి లోపం ప్రధాన సమస్య. విటమిన్ B6 ఉండే ఆహారం తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజూ 10-15 నిమిషాలు ఎండలో కూర్చుంటే విటమిన్ డి పొందవచ్చు. విటమిన్ B6.. సాల్మన్, చిక్‌పీస్, బంగాళదుంపలు, నాన్-సిట్రస్ పండ్లలో పుష్కలంగా ఉంటుంది.

పెయిన్‌కిల్లర్ల వినియోగం
తలనొప్పి, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండే పెయిన్ కిల్లర్స్ వాడాల్సిందే. కానీ వీటిని అతిగా, వైద్యుల సిఫార్సు లేకుండా తీసుకోవడం కిడ్నీలకు ప్రమాదకరం కావచ్చు. ఆ మాత్రలతో నొప్పుల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. కానీ అవే మాత్రలు కిడ్నీ క్యాన్సర్‌ను కూడా ప్రేరేపిస్తాయి.

నీరు తాగకపోవడం
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీలు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే కిడ్నీల్లో రాళ్లు, ఇతర సమస్యలు చాలా వరకు సరిపడినంత నీరు తాగకపోవడంతో సంభవించవచ్చు. ప్రతిరోజూ 12 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

శుద్ధి చేసిన ఆహారం
ప్రాసెస్ చేసిన ఆహారం టేస్టీగా ఉన్నప్పటికీ, అవి కిడ్నీలకు హానికరం. ప్రాసెస్ చేసిన ఫుడ్‌లో సోడియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. దీంతో ఆ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

వ్యాయామం చేయకపోవడం
ప్రతివారం కనీసం మూడు సార్లు వ్యాయామం చేసే వ్యక్తుల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గినట్లు ఒక పరిశోధనలో తేలింది. కిడ్నీ పనితీరు బలహీనంగా ఉన్నవారికి వైద్యులు నడక సిఫార్సు చేస్తుంటారు. కాబట్టి రోజుకు 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం
ఆల్కహాల్ లేదా వైన్ వినియోగం ఎక్కువగా ఉండే, ఆ అలవాటు మీ కిడ్నీలకు అంతం కావచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మద్యం ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ప్రమాదాన్ని రెండు రెట్లు పెంచుతుంది.

ఉప్పు అధిక వినియోగం
అధిక ఉప్పు (సోడియం) ఉన్న ఆహారాలను తీసుకుంటే బీపీ పెరిగే అవకాశం ఉంది. పైగా మీ కిడ్నీలకు కూడా హాని కలగవచ్చు. కాబట్టి ఆహారంలో ఎక్కువగా ఉప్పు వేయడానికి బదులుగా, ఆకు కూరలు, సుగంధ ద్రవ్యాలను ప్రయత్నించండి. క్రమక్రమంగా మీ ఆహారంలో ఉప్పును వీలైనంత తగ్గించడానికి అలవాటు పడండి.
Published by:Mahesh
First published:

Tags: Health, Health benefits, Kidney, Vitamins

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు