హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Teeth Whiten: దంతాలు తెల్లగా మెరవాలంటే..ఈ నేచురల్ టిప్స్ ఫాలో అవ్వండి..

Teeth Whiten: దంతాలు తెల్లగా మెరవాలంటే..ఈ నేచురల్ టిప్స్ ఫాలో అవ్వండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో లభించే వివిధ పదార్థాలతో సహజసిద్ధంగా దంతాలను తెల్లగా మార్చే చిట్కాలను పరిశీలిద్దాం.       

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Teeth Whiten: మనం ఆరోగ్యంగా ఉండాలంటే దంతాలను(Teeth) పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ప్రతిరోజు పళ్లను బ్రష్ చేస్తున్నాం. మనిషిలో అత్మవిశ్వాసం మెండుగా ఉండాలంటే ముఖ తేజస్సుకు చిరునవ్వు తోడవ్వాలి. పళ్లను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అది సాధ్యం అవుతుంది. ఇటీవల కాలంలో దంతాల రంగు మారడం అనే సమస్య చాలా మందిని వేధిస్తుంది. కొన్ని రకాల అలవాట్లతో పాటు మందులు కూడా అందుకు కారణం కావచ్చు. దంతాలు ఆరోగ్యంగా, తెల్లగా మెరిసేలా చేయడానికి ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కెమికల్స్ ఉపయోగించే అవకాశం ఉండడంతో పాటు వాటి ధరలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో లభించే వివిధ పదార్థాలతో సహజసిద్ధంగా దంతాలను తెల్లగా మార్చే చిట్కాలను పరిశీలిద్దాం.

* పసుపు

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇది దంతాలను పరిశుభ్రపర్చడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ముందుగా కొద్ది మొత్తంలో పసుపును నీటితో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమంతో రెండు నిమిషాల పాటు దంతాలను బ్రష్ చేయండి. ఒకవారం రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.

* యాక్టివేటెడ్ చార్‌కోల్

పచ్చగా మారిన దంతాలను తెల్లగా మార్చడంలో యాక్టివేటెడ్ చార్‌కోల్(బొగ్గు) సమర్థవంతంగా పనిచేస్తుంది. కొద్ది మొత్తంలో యాక్టివేట్ చేసిన బొగ్గును నీటితో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమంతో రెండు నిమిషాల పాటు దంతాలను బ్రష్ చేయండి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల తరువాత దంతాల్లో మార్పును మీరు చూడవచ్చు.

* కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్

ఆయిల్ పుల్లింగ్ అనేది పురాతన ఆయుర్వేద టెక్నిక్. నోటిలో ఉండే బాక్టీరియా, టాక్సిన్‌లను బయటకు పంపడానికి ఈ పద్దతిని ఫాలో అయ్యేవారు. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని 15-20 నిమిషాల పాటు పుక్కిలించాలి. ఆ తరువాత ఉమ్మివేసి నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనెలో దంతాలను తెల్లగా మార్చే గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. పాతకాలంలో ఈ పద్దతి అనుసరించేవారు.

* బేకింగ్ సోడా

పచ్చగా మారిన దంతాలను బేకింగ్ సోడాతో తెల్లగా మెరిసేలా చేయవచ్చు. ఇది రాపిడి మాదిరిగా పనిచేస్తూ దంతాలను శుభ్రం చేస్తుంది. ముందుగా బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమంతో దంతాలను బ్రష్ చేయాలి. దాదాపు రెండు నిమిషాలు బ్రష్ చేసిన తరువాత పళ్లను శ్రుభం చేసుకోవాలి. అయితే ఇలా ప్రతిరోజు చేయకూడదు. వారానికి ఒకసారి మాత్రమే చేయాలి.

Relationship: ఆఫీసులో ఇతరులకు చిరాకు తెప్పించే ఉద్యోగుల 7 అలవాట్లు..!

* హైడ్రోజన్ పెరాక్సైడ్

దంతాల రంగును మార్చడంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే బ్లీచింగ్ లక్షణాలు దంతాలను తెల్లబరుస్తాయి. ముందుగా హైడ్రోజన్ పెరాక్సైడ్, నీటిని సమాన మొత్తంలో కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. దాన్ని మౌత్ వాష్‌గా ప్రతిరోజు ఉపయోగించాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే ఫలితం ఉంటుంది.

తాజా ఆకుకూరలు, పండ్లు తినడం వల్ల కూడా దంతాలపై ఉండే మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా అవి నోటిలో లాలాజల ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో నోటిలో దంత క్షయం కలిగించే హానికరమైన ఆమ్లాలు తటస్థం అవుతాయి.

First published:

Tags: Health Tips, Teeth

ఉత్తమ కథలు