40 పుషప్స్ చేస్తే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని తేల్చిన అధ్యయనం

హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సగటు వయస్సు 39.6 ఏళ్లు ఉన్న 1,104 మంది పురుష ఫైర్‌ఫైటర్ల హెల్త్ డేటాను విశ్లేషించారు. 10 ఏళ్లలో 37 హృదయ సంబంధ జబ్బులు మాత్రమే బయటపడ్డాయి.

news18-telugu
Updated: February 19, 2019, 3:24 PM IST
40 పుషప్స్ చేస్తే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని తేల్చిన అధ్యయనం
40 పుషప్స్ చేస్తే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని తేల్చిన అధ్యయనం
  • Share this:
మీకు జిమ్‌కు వెళ్లే అలవాటు ఉందా? ఆగకుండా 40 పుషప్స్ చేయగలరా? అయితే మీకు గుండె జబ్బులు వచ్చే రిస్క్ తక్కువ. యాక్టీవ్‌గా ఉండే మధ్యవయస్సుగల పురుషులు ఆగకుండా 40 పుషప్స్ చేస్తే వారికి ఇది వర్తిస్తుంది. ఆగకుండా 10 పుషప్స్ చేసేవారితో పోలిస్తే 40 పుషప్స్ చేసేవారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ 96 శాతం తక్కువ అని ఓ పరిశోధనలో తేలింది. ఆ పరిశోధన ఫలితాలను జామా నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించారు. ఏరోబిక్ కెపాసిటీ కన్నా పుషప్స్ చేసే సామర్థ్యానికి గుండె జబ్బులకు సంబంధం ఉందని ఆ పరిశోధన తేల్చింది.

Read this: Ban TikTok: టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి... పెరుగుతున్న డిమాండ్లు

హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సగటు వయస్సు 39.6 ఏళ్లు ఉన్న 1,104 మంది పురుష ఫైర్‌ఫైటర్ల హెల్త్ డేటాను విశ్లేషించారు. 10 ఏళ్లలో 37 హృదయ సంబంధ జబ్బులు మాత్రమే బయటపడ్డాయి. "ఇతర వ్యాయామ పద్ధతులతో పోలిస్తే పుషప్స్ చేయడం చాలా సులువు. ఖర్చు కూడా అవసరం లేదు. హృదయ సంబంధ జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుంది" అని అమెరికాలోని హార్వర్డ్ టీ.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లీడ్ ఆథర్ జస్టిన్ యాంగ్ తెలిపారు. అయితే ఈ పరిశోధన ఫలితాలు మహిళలు, ఇతర వయస్సుగల పురుషులు, తక్కువ చురుగ్గా ఉండేవారికి వర్తించవని పరిశోధకులు వివరణ ఇచ్చారు.

Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండిఇవి కూడా చదవండి:

Aadhar Data Leak: ఇండేన్ గ్యాస్ కస్టమర్లు, డీలర్ల ఆధార్ డేటా లీక్Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?
First published: February 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>