Health Tips : షుగర్ ఉన్నవారు రెగ్యులర్‌గా ఉసిరి తింటే కలిగే ప్రయోజనాలివే..

ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్‌గా వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి, ఉసిరి తినడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం..

Amala Ravula | news18-telugu
Updated: June 1, 2019, 11:57 AM IST
Health Tips : షుగర్ ఉన్నవారు రెగ్యులర్‌గా ఉసిరి తింటే కలిగే ప్రయోజనాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: June 1, 2019, 11:57 AM IST
01షుగర్ అనే వ్యాధి ఈ మధ్యకాలంలో చాలామందికి కామన్‌గా మారింది. ఈ సమస్యని తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే, ఇలాంటివారికి ఉసిరి చక్కని పరిష్కారమని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఓ రకంగా చెప్పాలంటే షుగర్ వ్యాధిగ్రస్తులకి ఇది ఓ ఆయుర్వేద మెడిసిన్ అని చెబుతున్నారు. డయాబెటిక్ 2 పేషెంట్స్ ఈ ఉసిరిని తినడం వల్ల క్రానిక్ కండీషన్స్ మెరుగ్గా మారుతాయని.. అందుకే చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌లోనూ ఉసిరిని ఉపయోగిస్తారు.

ఉసిరిలోని ఎన్నో విటమిన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి ఆరోగ్యానికి ఇది చక్కని టానిక్‌లా పనిచేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ మెరుగవుతుంది. అదే విధంగా, బాడీ డీటాక్సిఫై అవుతుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్ కంటెంట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని విటమిన్ సి, కెలరీలు బరువుతగ్గించడంతో పాటు ఎన్నో ప్రయోజనాలనిస్తుంది.

ఇన్ని లాభాలున్న ఉసిరిని షుగర్ పేషెంట్స్ రోజూ తినడం ఖచ్చితంగా చేయాలి. దీనివల్ల షుగర్ అదుపులో ఉండడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి..



వేడి వేడి టీ, కాఫీలు తాగుతున్నారా.. కాన్సర్ వచ్చే ప్రమాదముంది జాగ్రత్త..

 
First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...