Home /News /life-style /

HAVING TROUBLE WITH BEING OVERWEIGHT THEN LOSE WEIGHT BY FOLLOWING THESE METHODS ON A DAILY BASIS PRV

Weight loss tips: అధిక బరువుతో ఇబ్బందులకు గురవుతున్నారా? అయితే రోజూ ఈ పద్దతులు పాటించి బరువు తగ్గించుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బరువు తగ్గడానికి (weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం (food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే బరువు (weight) తగ్గుతారు

    అధిక బరువు (heavy weight). మనిషికి మన: శాంతిని దూరం చేస్తుంది. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం తదితర కారణాలు బరువు పెరగడానికి (weight gain) కారణాలవుతాయి. అయితే ఈ అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమందికి ఆ సమయం (time) కూడా ఉండదు. బరువు తగ్గడానికి (weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం (food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే బరువు (weight) తగ్గుతారు.

    ఉత్తమ ఆహార పదార్థం..

    పాలు (Milk)  శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము (food). ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసుల (all ages) వారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం. పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటి లోకి సరిపడా శక్తి (energy) చేరుకుంటుంది. నిద్రలేమి (sleeping problems)తో బాధపడే వాళ్ళకు పాలు పరప్రసాదం లాంటివి. నిత్యం నిద్రపట్టక బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసెడు పాల (milk)లో తేనెను కలుపుకుని తాగితే కొన్నాళ్లకి కమ్మని నిద్ర (sleep)కు చేరువవుతారు. అయితే పాలు తాగితే బరువు (weight) కూడా తగ్గుతారట. అధిక బరువు ఉన్నవారు కొన్ని ప్రత్యేక పద్దతిలో పాలు తాగితే బరువును కంట్రోల్ (weight control)​లో ఉంచుకోవచ్చట.

    పాలు ఆరోగ్యాన్ని (health) ఇస్తాయి. ఇది అందరికీ తెలుసు. పాల వలన బరువు తగ్గడము (weight loss) కూడా సాధ్యమే ... మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ, డి-విటమిన్‌ (vitamin) సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబడింది . ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయం (heavy weight) కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. వీరి వయసు 45-60 మధ్య ఉంది. ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు (milk) త్రాగడంతో పాటు పిండి పదార్థాలు ఉన్న ఆహారము తక్కువగా (less food) తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు. అదే సమయములో ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గేందుకు (weight loss) ప్రయత్నించినవారు కేవలము 3 కిలోల బరువు (weight) మాత్రమే తగ్గారు. అందుకే పాలలోని కాల్షియం, విటమిన్‌ డి బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధన (researches)ల ద్వారా స్పష్టమైంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Weight loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు