సంతానం.. ఎంతోమంది దంపతుల కల. చాలా మంది మహిళలు మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు తహతహలాడుతుంటారు. ప్రెగ్నెన్సీ రావడం లేదని కంగారు పడుతుంటారు. అలాంటి వారికి చైనాకు చెందిన షెంగ్జింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ సలహా ఇస్తున్నారు. దంపతులు ఒకే రాత్రి రెండోసారి సెక్స్ చేస్తే మహిళలు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ డా లీ తెలిపారు. రాత్రి పూట ఒకసారి సెక్స్ చేసి.. మూడుగంటల తర్వాత రెండోసారి జరిగే కలయికలో విడుదలయ్యే స్పెర్మ్ చాలా బలంగా ఉంటుందని వెల్లడించారు. ఆ వీర్యంలో ప్రొటీన్ల సాంద్రత ఎక్కువగా ఉంటుందని, అది స్పెర్మ్ చలనాన్ని వేగవంతం చేస్తుందని వివరించారు. కొన్ని IVF కేసుల్లో ఈ పద్ధతి సత్ఫలితాలనిచ్చినట్లు ఆయన తెలిపారు. దాదాపు 500 జంటలను పరిశీలించగా 80 శాతం జంటల్లో ఇది సక్సెస్ అయినట్లు తేలిందని డా లీ వెల్లడించారు.
ప్రతీకాత్మక చిత్రం
‘గర్భం దాల్చడానికి కనీసం రెండు రోజుల వ్యవధి ఉండాలని ఏళ్లుగా చెప్పేవారు. కానీ, ఆ నియమానికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఇది. సెక్స్ ఎక్కువగా చేసినా గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మా పరిశోధనల్లో తేలింది.’ అని ఆయన వివరించారు. అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. జాతీయ ఆరోగ్య సంస్థ మాత్రం.. రెండు రోజులకు ఒకసారి శృంగారంలో పాల్గొంటేనే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ వస్తోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.