Home /News /life-style /

HAVE YOU DRUNK TURMERIC TEA IF YOU KNOW HOW MANY BENEFITS THIS HAS YOU WILL MAKE IT IMMEDIATELY UMG GH

Turmeric Tea: పసుపు టీ తాగారా .. దీంతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. వెంటనే తయారు చేసుకుంటారు !

 పసుపు టీ తాగారా .. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. వెంటనే తయారు చేసుకుంటారు !

పసుపు టీ తాగారా .. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. వెంటనే తయారు చేసుకుంటారు !

ఈ రోజుల్లో పసుపుతో కొత్తగా టీ (Turmeric Tea) కూడా చేస్తున్నారు. ఈ హెల్తీ(Health) డ్రింక్ ఎన్నో రకాల అనారోగ్యాలను దూరం చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
భారతీయుల వంటగది(Kitchen) లో తప్పనిసరిగా ఉండే పదార్థం పసుపు (Turmeric). కొన్ని వందల ఏళ్లుగా వంటల్లో, ఆయుర్వేద వైద్యంలో, చర్మ సంరక్షణకు, గాయాల నివారిణిగా.. ఇలా వివిధ అవసరాల కోసం పసుపును భారతీయులు ఉపయోగిస్తున్నారు. దీంట్లోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మన శరీరానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. అయితే ఈ రోజుల్లో దీనితో కొత్తగా టీ (Turmeric Tea) కూడా చేస్తున్నారు. ఈ హెల్తీ డ్రింక్ ఎన్నో రకాల అనారోగ్యాలను దూరం చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇప్పటికే పసుపు పాల డ్రింక్ సూపర్ ఫుడ్‌గా ఫేమస్ అయింది. కొన్ని కంపెనీ(Companies)లు ఏకంగా వీటిని తయారు చేసి అమ్ముతున్నాయి. ఇప్పుడు కొత్తగా ‘పసుపు టీ’ ఒక స్పెషల్ హెల్తీ హాట్ డ్రింక్‌గా ఫేమస్ అవుతోంది. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పసుపును నీటిలో నానబెట్టి, వేడిచేసి ఈ డ్రింక్ తయారు చేస్తారు. లేదా పసుపు టీ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గోల్డెన్ కలర్‌లో అందంగా, చిక్కగా కనిపించే ఈ పసుపు టీ.. మట్టి రుచిని కలిగి ఉంటుంది. ఈ స్పెషల్ డ్రింక్ హెల్త్ బెనిఫిట్స్ ఏవో చూద్దాం.

గుండెకు మంచిది
టర్మరిక్ టీ గుండెకు మంచిది. పసుపు టీలో కొన్ని సమ్మేళనాలు రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దాంతో పాటు పసుపు టీ రక్తంలో కొవ్వు స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఈ స్థాయిలు తక్కువగా ఉంటే, గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గిస్తుంది.

యాంటీ బాక్టీరియల్
పసుపు టీ అనేది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్. పసుపులో సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల నేచురల్ టర్మరిక్ టీలో కూడా ఇవన్నీ ఉంటాయి. ఈ స్పెషల్ డ్రింక్ శరీరంలో ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడి, శారీరక ఒత్తిడిని దూరం చేస్తుంది.

ఇదీ చదవండి: Green Tea with Lemon: నిమ్మకాయతో గ్రీన్ టీ కలిపి తాగారా.. దీని వల్ల ఎన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చో తెలుసా !


మానసిక ఆరోగ్యం
పసుపు టీ వ్యక్తుల మూడ్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో కర్కుమిన్ (curcumin) అనే పదార్థం ఉంటుంది, ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మూడ్ స్వింగ్స్‌ను తగ్గిస్తుంది. అలాగే వేడిగా ఉండే ఈ వెచ్చని టీ నుంచి వచ్చే మట్టి వాసన.. ఒత్తిడిని తగ్గిస్తుంది.



కేలరీలు తక్కువ
టర్మరిక్ టీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల అదనపు ఎనర్జీ అందదు కాబట్టి, వివిధ రకాల డైట్స్ ఫాలో అయ్యే వారికి ఇది బెస్ట్ హెల్తీ డ్రింక్ ఆప్షన్‌. బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేసేవారు జ్యూస్ లేదా ఎనర్జీ డ్రింక్స్‌కు బదులుగా పసుపు టీ తాగుతూ రీఫ్రెష్ కావచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Ayurveda health tips, Green tea, Health care, Turmeric

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు