వయసు 30 ఏళ్లు దాటిందా.. అయితే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!

సూపర్ ఫుడ్స్

కోవిడ్-19 ప్రభావంతో ఇంట్లోనే ఉంటున్నారా? సుదీర్ఘ పనిగంటలతో విసిగిపోయారా? వ్యాయామం చేయడం తగ్గిపోయిందా? ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతుందా? అయితే మీరు తీసుకుంటున్న ఆహారం, ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టాల్సిందే.

 • Share this:
  కోవిడ్-19 ప్రభావంతో ఇంట్లోనే ఉంటున్నారా? సుదీర్ఘ పనిగంటలతో విసిగిపోయారా? వ్యాయామం చేయడం తగ్గిపోయిందా? ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతుందా? అయితే మీరు తీసుకుంటున్న ఆహారం, ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టాల్సిందే. ఇవే కాకుండా వయసుకు తగినట్లు శరీరంలో వస్తున్న మార్పులను గమనించాలి. శరీరంలో ఎంత శక్తి ఉత్పన్నమవుతుంది.. ఎంత వరకు వాడుకుంటుంది లాంటివి పరిశీలించాలి. లేకుంటే భవిష్యత్తులో జీవక్రియ, జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి.

  సూపర్ ఫుడ్స్ పై ఆసక్తి..
  ఇటీవల కాలంలో చాలామంది ఆహారంపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. మంచి పోషకాహారాలను(సూపర్ ఫుడ్స్) తీసుకుంటూ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఎక్కువ యాంటీ ఆక్సిడెట్లు, ఫైటోకెమికల్స్, ఖనిజలవణాలు, విటమిన్లు పోషకాలకు నివాసాలని ఓజివా సహ వ్యవస్థాపకులు మిహిర్ గదాని తెలిపారు. అవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వృద్ధాప్యం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించగలుగుతాయని ఆయన అన్నారు.30 ఏళ్ల పైబడిన వారు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి, ఒత్తిడి తగ్గించుకోడానికి ఈ సూపర్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి.

  ఆకుపచ్చ పోషకాహారాలను తీసుకోవాలి..
  గ్రీన్ సూపర్ ఫుడ్స్.. శరీరం పీహెచ్ స్థాయిని సరైన స్థితిలో ఉంచుతాయని గదాని తెలిపారు. అంతేకాకుండా సరైన పోషకాలను అందిస్తాయని నిరూపితమయ్యానని చెప్పారు. ఇందులో ఆకు కూరలు, కాలే, కొత్తిమీర, స్పిరులినా లాంటి ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొదించడంలో సహాయపడటమే కాకుండా మీ శక్తి స్థాయిలను పెంచడానికి మీ దేహాన్ని నిర్విషీకరణ చేస్తాయి.

  మొక్కల్లో ప్రోటీన్ ను తీసుకోవాలి..
  వయస్సుతో పాటు ఆహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండేట్లు చూసుకోవాలి. ముఖ్యంగా మొక్కల్లో దొరికే ప్రోటీన్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే వీటని జీర్ణించుకోవడం సులభం. అంతేకాకుండా రుచితో పాటు ఎలాంటి దుష్ప్రభావాలు చూపవని గదాని స్పష్టం చేశారు. ఇందుకు మంచి ఉదాహరణ బఠాణినే. మంచి ప్రోటీనే కాకుండా ఐరన్ ను అందిస్తుంది. లాక్సోజ్ లోపం ఉన్నవారికి బఠాణీలు ఎంతో మేలు చేస్తాయి. ఇది కాకుండా గ్లూటేన్, ధాన్యాలు, పాలు, సోయాలు శరీరానికి మంచి శక్తి వనరులుగా పనిచేస్తాయి.

  ప్లాంట్ బేస్డ్ విటమిన్లు తీసుకుంటే మంచిది..
  కంటే మొక్కల నుంచి లభ్యమయ్యే విటమిన్లు తీసుకుంటే సింథటిక్ ప్రతిరూపాల మెరుగ్గా పనిచేస్తాయి. ఎందుకంటే శరీరం వీటిని బాగా గ్రహిస్తుంది. విటమిన్-సీ, ఈ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మొత్తం ఆరోగ్యం సరిగ్గా ఉండేలా చూసుకుంటాయి. విటమిన్లు ఎక్కువ ఆహారాల్లో బయోఫ్లవనోయిడ్స్ లాంటి ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి.

  తృణ ధాన్యాలు, విత్తనాలు..
  సూపర్ ఫుడ్స్ కు మంచి ఉదాహరణ తృణ ధాన్యాలు. శతాబ్దాలుగా ఇవి పోషక కారకాలుగా పరిగణిస్తున్నారు. వయసు పైబడుతున్న కొద్ది ఆహారంలో తృణ ధాన్యాలను చేర్చాలి. వీటి వల్ల గుెడె పనీతరు, జీర్ణక్రియ బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్, కాల్షియం, ఐరన్, పోటాషియం, పోషక ఆమ్లాలు లాంటి ఖనిజలవణాలు వీటిలో ఉంటాయి. తృణ ధాన్యాలకు క్వినోవా మంచి ఉదాహరణ. ఇవి కాకుండా ఆహారంలో అవిసే గింజలు, చియా విత్తనాలు, జనపనార విత్తనాలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు చేర్చాలి. సలాడ్లు, పానీయాలతో కలిపి తీసుకోవడం లేదా పొడి రూపంలో తీసుకుంటే మంచిది.
  Published by:Sumanth Kanukula
  First published: