మీరు 100% లవ్ సినిమా చూశారా? అందులో లవ్‌ని కొలవడానికి మ్యాథమెటిక్స్‌లో కళ్లు కళ్లు ప్లస్, వాళ్లు వీళ్లు మైనస్ అంటూ ఓ రచయిత ప్రేమకు లెక్కల్లో నిర్వచనం చెబుతాడు. అయితే, ఇప్పుడు గర్ల్స్ కాలేజీలో ఓ ప్రొఫెసర్ ఏకంగా లవ్ గురు అవతారం ఎత్తాడు. మ్యాథ్స్‌లో ఫార్ములాలు చెప్పాల్సిన ప్రొఫెసర్ లవ్ ఫార్ములాలు చెప్పడం మొదలుపెట్టాడు. అయితే, అతను చెబుతున్న లవ్ పాఠం మొత్తం ఓ యువతి వీడియో తీసి ప్రిన్సిపాల్‌కు చూపించడంతో అతడిని సస్పెండ్ చేశారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఉన్న ఓ మహిళా కాలేజీలో ఈ లవ్ ఫార్ములాను కనిపెట్టిన ప్రొఫెసర్ ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ పేరు చరణ్ సింగ్ అని తెలిసింది. అమ్మాయిలకు లవ్ ఫార్ములాలు చెప్పినందుకు క్షమాపణ చెబుతూ లెటర్ రాసి ఇచ్చాడు. అయినా సరే అతడిని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.
ప్రొఫెసర్ చెప్పిన లవ్ ఫార్ములా ఇదే..
'closeness - attraction = friendship', closeness + attraction = romantic love'. అయితే, అంతటితో అది ఆ ప్రవాహం ఆగిపోలేదు. 'attraction - closeness = crush' అని సూత్రీకరించాడు. అయితే, ముసలి వాళ్లు అయిన తర్వాత భార్యాభర్తల మధ్య attraction తగ్గిపోతుందట. అప్పుడు మంచి ఫ్రెండ్స్‌గా మారతారని చెప్పాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana, VIRAL NEWS