హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Harvard Study: పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు?హార్వర్డ్ రిసెర్చ్ సమాధానాలు ఇవే..

Harvard Study: పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు?హార్వర్డ్ రిసెర్చ్ సమాధానాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్త్రీ, పురుషుల జీవిత కాలానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి  తాజాగా ఓ స్టడీలో వెలుగుచూసింది. పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువ కాలం జీవించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని హార్వర్డ్ మెడికల్ స్టడీలో తేలింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Harvard Study: ప్రకృతి ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుందనే నానుడి ఉంది. అందుకు తగ్గట్టు అనేక విషయాల్లో మహిళలు(Women), పురుషుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. పురుషులకు(Men) కండరాలు సహజసిద్ధంగా బలంగా ఉండటంతో స్త్రీల కంటే బలంగా కనిపిస్తారు. పనులు వేగంగా చేయగలుగుతారు. అయితే స్త్రీలు, పురుషుల కంటే భిన్నమైన శరీరాకృతితో అందంగా ఉంటారు. అలాగే మగవాళ్ల కంటే వారు ఎక్కువ కాలం జీవిస్తారు. తాజాగా స్త్రీ, పురుషుల జీవిత కాలానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి తాజాగా ఓ స్టడీలో వెలుగుచూసింది. పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువ కాలం జీవించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని హార్వర్డ్ మెడికల్ స్టడీలో(Harward medical study) తేలింది.

ఆడ, మగవారి జీవిత కాలంలో ప్రకృతి అన్ని విధాలుగా కీలకపాత్ర పోషిస్తుందని, అయితే అలా ఎందుకు జరుగుతుందో అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని హార్వర్డ్ రిసెర్చ్ తెలిపింది. మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి కారణాలుగా పరిగణించే కొన్ని అంశాలను అధ్యయనం సూచించింది. అవేంటో పరిశీలిద్దాం.

* హార్మోన్స్

స్త్రీ, పురుషుల ఆరోగ్యంలో హార్మోన్స్ కీలకపాత్ర పోషిస్తాయి. పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది గుండె కండరాలను ఫిల్టర్ చేస్తుంది. తద్వారా కాలక్రమేణా అనేక రకాల గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇక, మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది గుండెను రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తాజా స్టడీ ప్రకారం.. మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి వారిలో గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తక్కువగా ఉండడమే కారణం.

* క్రోమోజోమ్స్

స్త్రీలు, పురుషులు పిండం అభివృద్ధి దశ నుంచే వేర్వేరుగా ఉంటారు. మనుషుల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే 22 జతల క్రోమోజోములు రెండు లింగాల్లో ఒకేలా ఉన్నా, 23వ జత వేరుగా ఉంటుంది. మగవారికి 23వ జతలో ఒక X, Y క్రోమోజోమ్ ఉండగా, ఆడవారికి 23వ జతలో రెండు X క్రోమోజోమ్‌లు ఉంటాయి. Y క్రోమోజోమ్ X క్రోమోజోమ్ కంటే మూడింట ఒక వంతు తక్కువగా ఉంటుంది. X కంటే తక్కువ జన్యువులను కలిగి ఉంటుంది. దీన్ని బట్టి పురుషుల్లో Y క్రోమోజోమ్‌లు కొన్ని వ్యాధులతో ముడిపడి ఉంటాయి. దీంతో పురుషులలో మరణాల రిస్క్ స్త్రీలలో కంటే ఎక్కువగా ఉండటానికి Y క్రోమోజోమ్‌ కారణమని హార్వర్డ్ మెడికల్ స్టడీ పేర్కొంది.

* జీవక్రియ

పురుషులతో పోలిస్తే మహిళల్లో జీవక్రియ చురుకుగా ఉంటుంది. అందుకు కారణం స్త్రీలలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటమే. స్త్రీలలో మంచి కొలెస్ట్రాల్ డెసిలీటర్‌కు 60.3 మిల్లీగ్రాములు కాగా పురుషులలో ఇది కేవలం 48.5 మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుంది. దీంతో స్త్రీలలో గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తక్కువగా ఉంటుంది.

Teeth Whiten: దంతాలు తెల్లగా మెరవాలంటే..ఈ నేచురల్ టిప్స్ ఫాలో అవ్వండి..

* పునరుత్పత్తి వ్యవస్థ

మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌కు కారణమవుతుంది. అయితే ఇటీవల రిపోర్ట్స్ ప్రకారం స్త్రీలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

* సోషల్, ప్రాక్టికల్ ప్యాక్టర్స్

సాధారణంగా స్త్రీలు ఇంట్లో వండిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇక పురుషులు తరచూ బయటి ఫుడ్ తీసుకునే అవకాశం ఉంది. పైగా స్త్రీలు ఇంటిపని కూడా చేయడంతో వారికి తగినంత శారీరక వ్యాయామం లభిస్తుంది. ఈ కారణాలతో పురుషుల కంటే స్త్రీలు వైద్యపరంగా బలంగా చురుగ్గా ఉంటారు.

First published:

Tags: Lifestyle, Women

ఉత్తమ కథలు