Home /News /life-style /

HARSH GOENKA SAYS BILL GATES JEFF BEZOS AND OTHER BILLIONAIRES HAVE THESE 7 TRAITS IN COMMON UMG GH

Billionaires Traits: ప్రపంచ కుబేరులు ఊరికే కారు.. ఇవిగో వాళ్లల్లో కామన్ క్వాలిటీస్ ఇవే..! హర్ష్ గోయెంకా అధ్యయనం ఇదే..!!

ప్రపంచ కుబేరుల్లో కామన్ పాయింట్స్ (Twitter)

ప్రపంచ కుబేరుల్లో కామన్ పాయింట్స్ (Twitter)

ప్రతి ఒక్కరూ ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, అత్యంత విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూర్‌ల విజయ రహస్యాలను తెలుసుకోవాలని భావిస్తారు. భారతీయ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) ప్రకారం.. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వారిగా గుర్తింపు దక్కించుకున్న కుబేరుల్లో ఏడు సాధార?

ఇంకా చదవండి ...
ప్రతి ఒక్కరూ ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, అత్యంత విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూర్‌ల విజయ (Winning) రహస్యాలను తెలుసుకోవాలని భావిస్తారు. భారతీయ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) ప్రకారం.. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వారిగా గుర్తింపు దక్కించుకున్న కుబేరుల్లో (billionaires) ఏడు సాధారణ లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఇటీవల హర్ష్ గోయెంకా చేసిన ఓ ట్వీట్‌లో.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Microsoft co-founder Bill Gates), అమెజాన్ సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(Jeff Bezos), వర్జిన్ గ్రూప్ చీఫ్ రిచర్డ్ బ్రాన్సన్, ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్, యాపిల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్‌ ఫొటోలను షేర్‌ చేశారు. వీరందరిలోనూ కనిపించే ఏడు లక్షణాలను ట్వీట్‌ చేశారు. అందరిలో ఉన్న మొదటి లక్షణం పొదుపు (Frugality) చేయడమని హర్ష్‌ గోయెంకా  చెప్పారు. హార్డ్‌ వర్క్‌ కాకుండా స్మార్ట్‌ వర్క్‌ (Smart Work) చేయడం వారందరిలో కనిపించే రెండో లక్షణమని వివరించారు.

అదే విధంగా డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించరని, వారిని డబ్బు నడిపించదని, ఇది వారిలో కనిపించే మూడో లక్షణమని తెలిపారు. తమపై తాము ఇన్వెస్ట్‌ చేసుకుంటారని, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారని, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావడానికి ప్రయత్నిస్తారని, ఇది ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వారిలో కనిపించే నాలుగో లక్షణమని చెప్పారు.

వీరందరూ ఎప్పుడూ క్యూరియస్‌గా ఉంటారని, విభిన్న అంశాలపై ఆసక్తి చూపుతుంటారని, ఇది ఐదో లక్షణమని RPG గ్రూప్ చైర్‌పర్సన్ తెలిపారు. ఎప్పుడూ తెలివైన వ్యక్తులతో సమయం గడపడానికి ప్రాధాన్యమిస్తారని, ఇది అందరిలో కనిపించే ఆరో లక్షణమని హర్ష్‌ గోయెంకా చెప్పారు. చివరిగా.. అందరూ సాధించిన విజయాలతో సంతృప్తి చెందరని, ఇంకా ఏదో సాధించాలనే తపనతో పని చేస్తుంటారని పేర్కొన్నారు.



గోయెంకా పేర్కొన్న వ్యక్తులలో ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన అమెజాన్‌ సహ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ కావడం గమనార్హం. ఇటీవల ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన రియల్ టైమ్ బిలియనీర్ జాబితాలో.. జెఫ్ ‌బెజోస్ ప్రస్తుతం 142.2 బిలియన్‌ డాలర్‌ల నికర ఆస్తి విలువతో మూడో స్థానంలో ఉన్నారు. బిల్‌ గేట్స్ 125 బిలియన్‌ డాలర్‌ల విలువైన ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్నారు. 61.2 బిలియన్ డాలర్ల సంపదతో జుకర్‌బర్గ్ ఈ జాబితాలో 16వ స్థానంలో ఉన్నారు.

హర్ష్‌ గోయెంకా పేర్కొన్న జాబితాలో ఆస్తుల విలువలో 731 ర్యాంక్‌లో ఉన్న బ్రాన్సన్ అందరికంటే వెనుకబడి ఉన్నారు. ఆయన నికర విలువ 3.9 బిలియన్‌ డాలర్‌లుగా పేర్కొన్నారు. టిమ్ కుక్ 1,528వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర ఆస్తుల విలువ 2 బిలియన్‌ల డాలర్‌లుగా తెలిపారు.
Published by:Mahesh
First published:

Tags: Amazon, Bill Gates, Jeff Bezos, Microsoft

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు