Home made Cake: రూ.100తో కేజీ కేక్.. New Year రోజు ఫ్రెండ్స్, ఫ్యామిలీ హ్యాపీగా తినొచ్చు

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో కేక్ తయారు చేసేటప్పుడు.. మీరు కేక్ మిశ్రమాన్ని బాగా గిలకొట్టేలా చూసుకోండి. అంతేకాకుండా అన్ని పదార్థాలను కలపడానికి ఎలక్ట్రిక్ బ్లెండరు ఉపయోగించాలి. ఎందుకంటే ఇది మిశ్రమాన్ని నురుగుగా, తేలికగా చేస్తుంది.

  • Share this:
    న్యూ ఇయర్ వచ్చేసింది. ప్రతి ఒక్కరూ డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 దాటగానే కేక్‌లు కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సంబరాలు చేసుకుంటారు. కేక్‌లు తింటూ ఆనందంగా గడుపుతారు. అయితే, ప్రస్తుతం కరోనా కారణంగా బయట తిరగొద్దని, బహిరంగంగా వేడుకలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో చాలా మంది ఇళ్లలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే, కేక్ కోసం మీరు అర్ధరాత్రి షాపుల వద్దకు వెళ్లి కేజీ కేక్ రూ.500 నుంచి రూ.700 ఖర్చు పెట్టి కొనుక్కోవడం దండగ. ఎలాగూ ఇంట్లోనే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నారు కాబట్టి, కేక్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. కేవలం రూ.100 ఖర్చు పెడితే ఎంచక్కా కేజీ కేక్ తయారు చేసుకోవచ్చు.

    కావలసిన పదార్థాలు
    మూడు కప్పుల మైదా పిండి
    4 గుడ్లు
    2 టీస్పూన్ల బేకింగ్ సోడా
    2 టీస్పూన్ల వెనిల్లా
    ఒకటిన్నర కప్పు చక్కెర పొడి
    ఒక కప్పు వెన్న
    ఒక కప్పు పాలు

    ఇంట్లోనే కేక్ ఎలా తయారు చేసుకోవాలి?
    ఇంట్లోనే కేక్ తయారుచేసుకోవడం చాలా సులభం. చక్కెర, వెన్నను తగిన పాళ్లల్లో కలపడం ద్వారా ప్రారంభించాలి. మ్యానువల్ విస్కర్ లేదా ఫోర్క్ తో మెత్తగా వచ్చే ఆ రెండింటిని బాగా కలపాలి. అనంతరం గుడ్లు పగులకొట్టి అందులో వేసి మళ్లీ బాగా మిక్స్ చేయాలి. తెల్లగా, క్రీముగా మారేవరకు కలపాలి.

    రెండో దశలో పిండి, గుడ్లను కలపాలి..
    ఈ మిశ్రమంలో మైదా పిండి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. పిండిలో బేకింగ్ సోడా సమాన పాళ్లలో ఉండేలా చూసుకోవాలి. క్రమంగా గుడ్డు మిశ్రమాన్ని దీనికి జోడించండి. అవసరమైతే కొద్దిగా పాలు వేసి పిండి మెత్తగా వచ్చేవరకు మృదువుగా కలపాలి. మీ కేక్ స్థిరత్వం బాగానే ఉందని మీరు భావిస్తే మీరు మొత్తం పాలు వేయాల్సిన పనిలేదు. అనంతరం వెనిల్లా ఎసెన్స్ ను వేసి బాగా కలపాలి. గుడ్డ వాసన పోయే వరకు ఈ వెనిల్లా ఎసెన్స్ కలుపుకోవాలి.

    మూడో దశలో మీ సౌలభ్యమేరకు కేక్‌ను బేక్ చేయాలి
    బేకింగ్ టిన్ పై కొంత మైదా చల్లుకోవాలి. ఇది కేక్‌ను బేస్ కు అంటుకోకుండా చేస్తుంది. మీరు దాన్ని వెన్న పూసిన కాగితంపై కూడా చేయవచ్చు. తయారు చేసిన మిశ్రమాన్ని టిన్ లో పోసి ప్రెజర్ కుక్కర్ స్టాండ్ లో ఉంచాలి. కుక్కర్లో నీరు పోయకూడదు. మీరు బేకింగ్ డిషన్ ను ఇన్వర్టెడ్ స్టీల్ ప్లేటులో ఉంచవచ్చు. రెండు నిమిషాల పాటు ప్రేజర్ కుక్కర్ లో వేడి చేయాలి. ఇప్పుడు విజిల్ తొలగించి 35 నుంచి 40 నిమిషాల వరకు ఉడికించాలి. మీరు ఎలక్ట్రిక్ ఓవెన్ ఉపయోగిస్తుంటే 180 డిగ్రీల వద్ద 30 నుంచి 35 నిమిషాలు ఉడికించాలి.

    చివరి దశలో కత్తి లేదా స్కేవర్ తో కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లో కేక్ తయారు చేసేటప్పుడు.. మీరు కేక్ మిశ్రమాన్ని బాగా గిలకొట్టేలా చూసుకోండి. అంతేకాకుండా అన్ని పదార్థాలను కలపడానికి ఎలక్ట్రిక్ బ్లెండరు ఉపయోగించాలి. ఎందుకంటే ఇది మిశ్రమాన్ని నురుగుగా, తేలికగా చేస్తుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: