ప్రపంచ వ్యాప్తంగా కొత్స సంవత్సరాది వేడుకలు మిన్నంటుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో ఇప్పటికే కొత్త సంవత్సరానికి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆ దేశాల్లో అర్థరాత్రి 12 గంటలు దాటిన వెంటనే...అక్కడి ప్రజలు పార్టీ చేసుకుంటున్నారు. బార్లు, రెస్టారెంట్లల్లో మ్యూజిక్ ఫెస్టివల్స్ హోరెత్తిస్తున్నాయి. బాణాసంచా చప్పుళ్లతో వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. కుర్రకారు మందేస్తూ, చిందేస్తూ వేడుకలు జరుపుకొంటున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో కొత్స సంవత్సరాది వేడుకలు మిన్నంటాయి. ఆ నగరాల్లో అర్థరాత్రి 12 గంటలు కాగానే న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అక్కడి ప్రజలు.
భారత కాలమానం ప్రకారం చూస్తే సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్‌లో అర్థరాత్రి 12 గంటలు అవుతుంది. అంటే ఇండియా టైమ్ కన్నా న్యూజిలాండ్ ఏడున్నర గంటల ముందే ఉంటుంది. దీంతో ఇక్కడ సాయంత్రం 4.30 గంటలు కాగానే ఆక్లాండ్‌లో రోజు మారిపోతుంది. దీంతో మనకన్నా ముందే ఆక్లాండ్ ప్రజలు 2019 సంవత్సరానికి ఆహ్వానం పలికారు. కొత్త సంవత్సర వేడుకలతో ఆక్లాండ్ వీధులు కిటకిటలాడుతున్నాయి. జనమంతా కుటుంబ సమేతంగా పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
#WATCH Australia's Sydney welcomes the new year with spectacular fireworks. pic.twitter.com/SI0gzC33bq
— ANI (@ANI) December 31, 2018
Australia's Sydney welcomes the new year with spectacular fireworks. pic.twitter.com/pGt37zg8zj
— ANI (@ANI) December 31, 2018
New Zealand's Auckland welcomes the new year with fireworks #NewYear2019 pic.twitter.com/acC47C5Edb
— ANI (@ANI) December 31, 2018
ఇక రష్యాలో సాయంత్రం 5.30 గంటలకు, ఆస్ట్రేలియాలో సాయంత్రం 6.30 గంటల నుంచి, చైనాలో రాత్రి 9.30 గంటలకు... ఇలా మనకన్నా ముందే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇండియాలో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికిన తర్వాత పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, జెర్మనీ, యూకే, అర్జెంటీనా, అమెరికాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.