Makar Sankranti 2019: సకుటుంబ ‘సంక్రాంతి’ సమేతంగా..

Happy Makar Sankranthi 2019 | పండుగంటే ఆనందం.. పండుగంటే ఆహ్లాదం.. పండుగంటే మట్టివాసన.. పండగంటే వేడుక.. మన అనుకునే కుటుంబసభ్యులతో ఎప్పుడూ ఆనందంగా ఉంటామో అవి నిజంగా పండుగ క్షణాలే..

Amala Ravula | news18-telugu
Updated: January 13, 2019, 2:52 PM IST
Makar Sankranti 2019: సకుటుంబ ‘సంక్రాంతి’ సమేతంగా..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 13, 2019, 2:52 PM IST
సంక్రాంతి వచ్చిందంటే పట్టణాన్ని వీడి పల్లె మట్టివాసనకోసం పరుగులు పెడుతున్నారు సిటీజనం. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్నలు, చిన్నమ్మ, చిన్నాన్న అక్కలు, చెల్లెళ్లు, తమ్ముళ్లు, అన్నలు, బావలు, మరదళ్లు ఇలా మన బంధాలు, అనుబంధాలతో ఆనందంగా గడపాలని బయల్దేరుతున్నారు. బస్సులు, రైళ్లు ఇలా ఏది పడితే ఆ వాహనం ఎక్కి సొంతవూరికి తమ ఆనందాన్ని వెతుక్కుంటూ వెళుతున్నారు. తెలుగు సాంప్రదాయంలో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకతే అది.

makar sankranthi 2019, happy makar sankranthi, makar sankranti 2019 date and time, makar sankranthi images, kite festival, మకర సంక్రాంతి 2019, పతంగుల పండుగ, సంక్రాంతి విశేషాలు విశిష్టతలు
ప్రయాణీకులతో కిక్కిరిసిన రైళ్లు

ప్రతీ ఒక్కరూ ఈ పండుగను పట్టణాలకంటే గ్రామాల్లోనే చేసుకునేందుకు ఆరాటపడతారు. భోగిమంటలు, భోగి పండ్లు, కొత్త వంటలు, కోరుకున్న ఆనందాలు ఇలా అన్నింటినీ కలబోతే సంక్రాంతి. ఉద్యోగాలు, చదువులు అనేక కారణాల చేత గ్రామాలను వదిలి సిటీకి వచ్చిన వారంతా ఓ నాలుగు రోజులు మళ్లీ మన మూలాలు వెతుక్కుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను అంతా ఏకమై గుర్తుచేసుకోవడమే సంక్రాంతి సంబరం.

makar sankranthi 2019, happy makar sankranthi, makar sankranti 2019 date and time, makar sankranthi images, kite festival, మకర సంక్రాంతి 2019, పతంగుల పండుగ, సంక్రాంతి విశేషాలు విశిష్టతలు
పండుగకి నైవేద్యాలు వండుతున్న మహిళలు
అప్పటివరకూ ఆఫీసుల్లో ఆజమాయిషీ చేసే ఉద్యోగులు ఇంటి పెద్దల ముందు చిన్నపిల్లలైపోతారు. గాలిపటాలు ఎగురవేస్తూ అప్పటివరకూ ఉన్న ఒత్తిళ్లను గాలికి వదిలేస్తారు. సంవత్సరానికోసారి వచ్చే పండుగ ప్రతీ ఒక్కరిలోనూ సంతోషం నింపేస్తుంది. అందుకే, ఈ సంబరాన్ని, సందర్భాన్ని ఎవరూ మిస్ చేసుకోరు. ఇక చిన్నపిల్లల సంబరానికి కొదవే ఉండదు. భోగిపళ్లతో దిష్టి తీయడం మొదలుపెడితే.. గాలిపటాల అల్లర్లు, పిండివంటల పంపకాలు, తల్లిదండ్రులు ఇచ్చే తాయిలాలు వీటన్నింటికోసం వాళ్లు చేసే అల్లర్లు అన్నీ ప్రత్యేకమే.

makar sankranthi 2019, happy makar sankranthi, makar sankranti 2019 date and time, makar sankranthi images, kite festival, మకర సంక్రాంతి 2019, పతంగుల పండుగ, సంక్రాంతి విశేషాలు విశిష్టతలు
ఆకాశంలో అలరిస్తున్న గాలిపటాలు
Loading....
కొత్త అల్లుళ్లు సరికొత్త కోరికలు కోరితే అత్తింటివారు చేసిపెట్టడం.. కొంటె మరదళ్లు బావలను ఏడిపిస్తే పైకి ఉడుక్కుంటేనే లోలోపల సంబరం.. అమ్మమ్మ, తాతయ్యల ఆశీర్వాదాలు, అమ్మ, నాన్నల గారాబాలు, వీటన్నింటిని మరింత తీపి చేసే తీపివంటలు.. ఇలా ప్రతీది ఈ పండుగను ప్రత్యేకం చేస్తుంది..
అందుకే ఈ వేడుక సకుటుంబ సంక్రాంతిగా మారింది.
First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు