హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Father's Day 2020: నాన్నంటే ఎందుకు ఇష్టమంటే..

Father's Day 2020: నాన్నంటే ఎందుకు ఇష్టమంటే..

హ్యాపీ ఫాదర్స్ డే..

హ్యాపీ ఫాదర్స్ డే..

Happy Fathers Day 2020 | ఎదగడం అంటే.. తెలియనితనం.. ఎలా నడవాలి.. ఏం చేయాలి ఇలాంటివి తెలియక తప్పటడుగులు వేస్తుంటాం.. వీటిని అమ్మ మెల్లిగా చెబుతుంది. కానీ మనం మొండిఘటాలం కదా.. ఎందుకు వింటాం.. అందుకే నాన్న సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు.. అప్పుడే మనకి ఇష్టం లేకపోయినా.. తప్పదు అన్నట్టు చేస్తుంటాం..

ఇంకా చదవండి ...

  Father's Day 2020: నీకు ఎవరంటే బాగా ఇష్టం అని అడిగితే... ఏ మాత్రం ఆలోచించకుండా ‘అమ్మ’ అని చెబుతారు అందరూ... ఇంకెవరంటే.. రెండో స్థానం ‘నాన్న’ అని చెబుతారు.. అవును.. అమ్మ 9 నెలలు మనల్ని తన కడుపులో మోసి కంటుంది.. ఆమెకి మొదటి స్థానం ఇవ్వాల్సిందే.. నాన్న రేసులో కాస్తా వెనుకపడ్డాడు కదా.. అందుకే తర్వాతి స్థానం ఆయనకి!.. కానీ, నిజానికీ.. అమ్మ 9 నెలలు మోస్తే.. నాన్న పిల్లల్ని జీవితంలో ఎదిగేవరకూ మోస్తూనే ఉంటాడు.. ఏంట్రా.. ఈ మార్కులు ఏంట్రా.. ఆ తినడం ఏంట్రా.. సరిగా ఉండలేవా.. అంటూ తిడుతూనే కోప్పడుతూనే పెంచుతాడు..భయం చెబుతాడు.. అది తన బాధ్యతగా ఫీల్ అవుతాడు.. అప్పుడు అలా చెప్పినందుకు మనమూ ఫీల్ అవుతుంటాం.. కానీ.. ఆ వయసు వచ్చాక కానీ తెలీదు.. నాన్న ఎందుకు కోప్పడేవాడో.. ఎప్పుడూ కూడా అమ్మాచూడు నాన్న ఎలా మాట్లాడుతున్నాడు.. ఎందుకిలా అంటూ అమ్మ దగ్గర కంప్లైంట్స్ చేస్తుంటాం.. అమ్మ కూడా ఓ నవ్వు నవ్వేసి.. పట్టించుకోకులే అంటుంది.

  ఎదగడం అంటే.. తెలియనితనం.. ఎలా నడవాలి.. ఏం చేయాలి ఇలాంటివి తెలియక తప్పటడుగులు వేస్తుంటాం.. వీటిని అమ్మ మెల్లిగా చెబుతుంది. కానీ మనం మొండిఘటాలం కదా.. ఎందుకు వింటాం.. అందుకే నాన్న సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు.. అప్పుడే మనకి ఇష్టం లేకపోయినా.. తప్పదు అన్నట్టు చేస్తుంటాం.. ఆ తప్పులని సరిచేసుకుంటాం.. అందుకే..నాన్న ఓ విలన్‌లా కనిపించే హీరో.. అమ్మాయిల విషయంలో కాస్తా మెతకగా ఉన్నా.. అబ్బాయిల విషయంలో హాస్టల్ వార్డెన్‌లా,కాలేజ్ ప్రిన్సిపాల్‌లా బిహేవ్ చేస్తుంటాడు నాన్న. ఎందుకంటే ఆయనకి తెలుసు. తన తల్లి.. కూతురి రూపంలో పుట్టిందని.. కొన్నిరోజులైతే అత్తారిల్లు అంటూ తనని వదిలి వెళ్తుందని.. ఉన్న కొన్నిరోజులైనా బిడ్డని యువరాణిలా పెంచాలనుకుంటాడు.. పెంచుతాడు..

  ఇక కొడుకు విషయానికొస్తే వాడికి బాధ్యత నేర్పాలి. ఎలా బతకాలో నేర్పాలి. ఎందుకంటే.. వాడే రేపటి జీవనాధారం.. తరాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కొడుకుపైనే ఉంటుందనే.. ఓ చిన్ని స్వార్థం!.. అది కొడుకు ఎదుగుదలకేగా.. ఎంతకష్టమైనా తాను భరించాలనుకుంటాడు తప్ప.. ఆ బాధను పిల్లలపైకి తీసుకురావాలనుకోడు. అందుకే నాన్న ఇంటికి మూలస్తంభం.. ఇప్పటికీ.. ఎప్పటికీ..

  అమ్మ.. నాన్న.. అక్కా.. చెల్లి.. ఇలా ప్రతిబంధం ఓ అపురూపం.. అనిర్వచనీయం.. అలాంటి బంధాలన్నింటికీ ఒక్కరోజు అవసరమా.. తల్లిదండ్రులను ప్రేమించే వారికి ప్రతీరోజూ మదర్స్‌డే, ఫాదర్స్‌డేనే.. ఏమంటారు.

  Published by:Janardhan V
  First published:

  Tags: Fathers Day, Fathers Day 2020, Happy Fathers Day, HUMAN STORY

  ఉత్తమ కథలు