శ్రీ హనుమాన్ యంత్రం మనతో ఉంటే ఏం జరుగుతుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

హనుమాన్ యంత్రం.. ఆంజనేయ స్వామి కొలువుండే మహాశక్తివంతమైన యంత్రం.. ఈ యంత్రం వల్ల ప్రమాదాల బారినుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు పండితులు.

  • Share this:
చాలామంది ఇళ్లల్లో హనుమాన్ యంత్రం ఉంటుంది. సాక్షాత్తూ ఆంజనేయస్వామి కొలువై ఉండే ఈ యంత్రం వాహన ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుందని పురాణాలు చెబుతున్నాయి. పూజాగదిలో ఈ యంత్రాన్ని ఉంచి బయటికివెళ్లే సమయంలో ఈ యంత్రానికి నమస్కరించి రావడం వల్ల శుభం జరుగుతుందని నమ్మకం. ఈ యంత్రాన్ని ‘ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమ:’ అనే మంత్రం పఠిస్తూ పూజించాలి.

భూత, ప్రేత, పిశాచాల్లాంటి బాధలు, భయాల నుంచి బయటపడేందుకు ఆంజనేయస్వామిని పూజిస్తారు. బక్తుల మొర ఆలకించి కొండంత అండై ఉంటాడు. ఆదుకుని ఆపదలను తొలగిస్తాడు.


అయితే, ఏవైనా కూడా నమ్మకాలు.. కొన్నిసార్లు జరగొచ్చు. కొన్నిసార్లు జరగకపోవచ్చు. అంతేకానీ, గాల్లో దీపం పెట్టి రక్షించమన్నట్లు.. యంత్రం ఉంది కదా ప్రమాదాలు జరగవనే నిర్లక్ష్యం కూడదు.. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే పూజలు కొనసాగించాలి.
First published: