ఇలా చేస్తే మీ కిచెన్ అద్దంలా మెరిసిపోతుంది..

Guide to kitchen maintenance | పెద్ద ఖర్చులేకుండానే ఈ డెకరేషన్ ఐడియాల ద్వారా మీ వంటగది స్వరూపాన్ని మార్చుకోవచ్చు.  వంటచేసే చోటు శుభ్రంగా చూడ్డానికి అందంగా ఉంటేనే అలసట లేకుండా ఆహారాన్ని వండుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు..

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 12:47 PM IST
ఇలా చేస్తే మీ కిచెన్ అద్దంలా మెరిసిపోతుంది..
కిచెన్‌ని శుభ్రంగా ఉంచేందుకు చిట్కాలు
  • Share this:
కిచెన్లను కొంత అదనపు శ్రద్ధ, ప్రేమతో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వంట గది అందంగా ఉంటే ఇంటికి కొత్త రూపు వస్తుంది. పెద్ద ఖర్చులేకుండానే ఈ డెకరేషన్ ఐడియాల ద్వారా మీ వంటగది స్వరూపాన్ని మార్చుకోవచ్చు.  వంటచేసే చోటు శుభ్రంగా చూడ్డానికి అందంగా ఉంటేనే అలసట లేకుండా ఆహారాన్ని వండుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు..ఫ్లోర్ పెయింటింగ్
దీని కోసం మీరు ఓ పెయింటింగ్ నిపుణుడిని పిలవాల్సిన అవసరం లేదు. దీన్ని మీరే సొంతంగా చేసుకోవచ్చు. మీకు నచ్చిన అందమైన పెయింటింగ్ లుక్ కోసం కొన్ని పెయింటర్స్ టేపులు, రంగులు ఎంచుకోండి.

ఫ్లోటింగ్ షెల్ఫులు
ఫ్లోటింగ్ షెల్ఫులు మీ కిచెన్ కు సరికొత్త లుక్ తీసుకొస్తాయి. అవి స్టోరేజ్ గా ఉపయోగపడటమే కాదు మొత్తం ఇంటి రూపాన్ని మార్చేస్తాయి.
సంప్రదాయ, సమకాలీన లుక్
కిచెన్ కు ప్రత్యేకమైన, చక్కని రూపం కోసం సంప్రదాయ, సమకాలీన లుక్స్ రెండింటిని కలపండి.

సీలింగ్ కు పెయింటింగ్
పెయింటింగ్ ద్వారా ఇంటికి కొత్తదనం వస్తుంది. మీకు నచ్చిన రంగును కిచెన్ సీలింగ్ పై వేయించండి. అయితే కాంట్రాస్ట్ రంగుల కోసం కొత్త ఖాళీ వదలడం మాత్రం మరువకండి.అందాన్ని పెంచే కృత్రిమ మొక్కలు
మీ కిచెన్ లో మీరు కృత్రిమ మొక్కలు పెట్టి చూడండి, ఆ గది రూపాన్ని అవి పూర్తిగా మార్చేస్తాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే తేడా తెలుస్తుంది.

స్టోరేజ్ గా కిచెన్ ద్వీపం
స్టోరెజ్ ఆప్షన్ ఉన్న కిచెన్ కౌంటర్ టాప్ ఎంచుకోండి. దాంట్లో మీరు అనేక వస్తువులు స్టోర్ చేయవచ్చు, అదే సమయంలో కిచెన్ కు కొత్త రూపు తీసుకురావచ్చు.

పాట్ స్టాండ్
మీ రాగి లేదా స్టీల్ సామాన్లు మీ కిచెన్ ఆకర్షణీయంగా మార్చేలా చూడండి. ఆ పనిని మరింత సులభతరం చేసేందుకు కొత్త పాట్ హ్యాండిల్ తెచ్చుకోండి.


ఎక్లెక్ టిక్ టచ్
విభిన్నమైన టచెస్ ఇస్తే కిచెన్ కు బ్రాండ్ న్యూ లుక్ వస్తుంది.

అందమైన రగ్స్
కిచెన్ లో అందమైన రగ్స్ ఉంటే అవి లుక్ ను మార్చేయడమే కాదు కంటికి ఇంపుగా కూడా ఉంటాయి. కాబట్టి, కాంట్రాస్ట్ రంగుల్లో ఉండే కార్పెట్లు ఉండేలా చూసుకోండి.

మొత్తం తెల్లని కిచెన్
కిచెన్ మొత్తం తెల్లగా ఉండటమన్నది ఎప్పటికీ నిలిచి ఉండే స్టైల్. కాని మరకల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading