హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Diabetes Health Tips: జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

Diabetes Health Tips: జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

జామకాయలతో డయాబెటిస్‌కి చెక్...

జామకాయలతో డయాబెటిస్‌కి చెక్...

Guavas For Diabetes: బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే... జామకాయలు తినాలి. జామలో ఉండే పోషకాలు డయాబెటిస్ అంతు చూస్తాయి. ఇవి వెంటనే జీర్ణం కావు. అందువల్ల షుగర్ ఉన్నవారికి ఇవి సరైన ఆహారం.

Diabetes Health Tips : ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో చాలా వరకూ కమర్షియల్ ఫుడ్డే. అందువల్లే మనకు అడ్డమైన రోగాలూ వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ చాలా మందికి వచ్చేస్తోంది. మన బాడీలోని పాంక్రియాస్ నుంచీ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉండేలా ఇన్సులిన్ చేస్తుంది. ఐతే... మన బాడీలో షుగర్ ఎక్కువైపోతే... ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అప్పుడు మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ మరింత పెరిగిపోతాయి. వాటిని కంట్రోల్ చెయ్యడానికి మనం ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్‌ను బాడీలోకి ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఇదీ సింపుల్‌గా డయాబెటిస్ అంటే. ఈ వ్యాధి ఉన్నవారికి ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాదు. అందువల్ల వాళ్లు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. అందుకే మనం షుగర్ ఉండే పదార్థాలు ఎక్కువగా తినకూడదు. మనం తినే అన్నంలో కూడా షుగర్ ఉంటుంది. అందువల్ల బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తింటే.... ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. డయాబెటిస్ సమస్య కూడా రాదు.

డయాబెటిస్ లేకపోతే హ్యాపీ. అదే ఉంటే దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిందే. అందుకోసం జామకాయలు బాగా ఉపయోగపడతాయి. ఏడాదంతా కాసే జామకాయలు... చలికాలంలో ఎక్కువగా వస్తాయి. ఇంతకీ జామకాయలు డయాబెటిస్‌ని ఎలా కంట్రోల్ చేస్తాయి?

1. జామలో తక్కువ స్థాయి గ్లికామిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. అందువల్ల జామకాయలు త్వరగా జీర్ణం కావు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోకుండా ఉంటాయి. అందువల్ల షుగర్ పేషెంట్లకు ఇవి సరైన ఆహారం.

2. జామకాయల్లో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువ. ఇది బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని చెక్ చేసి... సరిగా ఉంచుతుంది. ఫైబర్ కూడా ఆలస్యంగా జీర్ణమయేదే.

3. జామలో కేలరీలు తక్కువే. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు జామ తినవచ్చు. అధిక బరువు కూడా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని పెంచగలదు. 100 గ్రాముల జామలో 68 కేలరీలుంటాయి. అలాగే షుగర్ 8.92 శాతమే ఉంటుంది.

4. జామలో సోడియం తక్కువ. పొటాషియం ఎక్కువ. డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి ఇవి రెండు అవసరమే.

5. విటమిన్ C... కమలాపండులో కంటే... జామలో నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. ఇది మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కూడా డయాబెటిస్ ఉన్నవారికి అత్యవసరం.

జామలో ఇంకా చాలా గుణాలున్నాయి. విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. జామకాయను డైరెక్టుగా తినండి లేదా జ్యూస్ చేసుకొని (అందులో షుగర్ కలపకుండా) తాగండి. ఐతే... మార్కెట్లలో జామ జ్యూస్ టెట్రా ప్యాకెట్లు లభిస్తున్నాయి కదా అని అవి మాత్రం తాగకండి. వాటిలో జామ జ్యూస్ ఉండేది 12 శాతమే. మిగతాదంతా షుగర్, ఇతరత్రా సింథటిక్ కలర్సే. డబ్బులన్నీ వాటికి తగలేసే బదులు... ఒరిజినల్ జామకాయల్నే కొనుక్కు తింటే ఎంతో మేలు. ఏది ఏమైనా ఇలాంటివి తినేముందు ఓసారి డాక్టర్‌ని సంప్రదించి... వాళ్లు చెప్పినట్లుగా తింటే... డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

First published:

Tags: Health benefits, Health Tips, Women health

ఉత్తమ కథలు