GROUP -4 Merit List : గ్రూప్ -4 రిజల్ట్స్ రిలీజ్.. వెబ్‌సైట్‌లో మెరిట్ లిస్ట్

తెలంగాణలో గ్రూప్ 4 సహా వివిధ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్‌ని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.

Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 12:13 PM IST
GROUP -4 Merit List : గ్రూప్ -4 రిజల్ట్స్ రిలీజ్.. వెబ్‌సైట్‌లో మెరిట్ లిస్ట్
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 12:13 PM IST
గతసంవత్సరం అక్టోబర్ 7న నిర్వహించిన గ్రూప్ 4 సహా వివిధ పోస్టుల మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 4 మెరిట్‌లిస్టులో 2,72,132 మంది, టీఎస్ ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 33,132 మంది, జీహెచ్‌ఎంసీ బిల్ కలెక్టర్ పోస్టులకు 69,378 మంది, బేవరేజ్ కార్పొరేషన్‌లోని వివిధ ఉద్యోగాలకు 19,545మంది అర్హత సాధించారు. ఈ వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
అయితే, తెలంగాణలో గ్రూప్ 4 పోస్టులు 1,595, ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 124 బిల్ కలెక్టర్పోస్టులు, బేవరేజెస్ కార్పొరేషన్‌తో 76పోస్టుల భర్తీ కోసం అధికారులు పరీక్షలునిర్వహించారు.
ఇక తెలంగాణ గురుకులాల్లోని డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా కూడా విడుదలైనంది. కోర్టు తీర్పుననుసరించి విడుదలైన జాబితా కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఇవి కూడా చదవండి..

World storytelling Day : పిల్లలకు కథలు చెప్పడం వల్ల ఎన్ని లాభాలో చెబుతున్న సైకాలజిస్టులు



Health Tips : టెన్షన్ ఎంత ఉందో చెప్పే ప్యాచ్ వచ్చేసింది.. ఎగ్జామ్స్ టైమ్‌లో బెస్ట్..
First published: March 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...