జీడిపప్పు కేరాఫ్ ఆఫ్రికా... ప్రపంచానికే ఆదర్శం

ప్రస్తుతం ప్రపంచంలోనే జీడిపప్పు ఎగుమతుల్లో అగ్రస్థానం సంపాదించింది ఐవరీ కోస్ట్. రైతులకు గిట్టుబాటు ధర, రాబడి, మార్కెట్ డిమాండ్ అధికంగా ఉండే ఉత్పత్తులను పండించాలనే తీర్మానంతోనే ఈ పురోగతి సాధ్యమైంది.

Krishna Kumar N | news18
Updated: September 15, 2019, 1:15 PM IST
జీడిపప్పు కేరాఫ్ ఆఫ్రికా... ప్రపంచానికే ఆదర్శం
జీడిపప్పు కేరాఫ్ ఆఫ్రికా... ప్రపంచానికే ఆదర్శం
  • News18
  • Last Updated: September 15, 2019, 1:15 PM IST
  • Share this:
జీడిపప్పు అనేక పోషకాల నిలయం. భారతీయులకు ఎంతో ప్రీతిపాత్రమైన డ్రై ఫ్రూట్. తిరుపతి లడ్డూ దగ్గర్నుంచి జీడిపప్పు ఉప్మా దాకా అన్నింటిలోనూ జీడిపప్పు ఉండాల్సిందే. తినేటప్పుడు జీడిపప్పు వచ్చిందంటే ‘అదృష్ట‌వంతుడివి రా...’ అంటూ కుళ్లుకుంటాం. అయితే మనం తినే జీడిపప్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా... అదేంటి మనదేశంలో జీడిపప్పు పండిస్తున్నారు కదా... మళ్లీ ఎక్కడినుంచో రావడం ఏంటి? అనుకుంటున్నారా...! అవును మనమూ జీడిపప్పును పండిస్తున్నాం... అయితే అది సరిపోక విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనదేశానికి వచ్చే జీడిపప్పులో అధిక భాగం ‘ఐవరీ కోస్ట్’ అనే పశ్చిమ ఆఫ్రికా ఖండంలోని ఓ స్వతంత్ర రాజ్యం నుంచీ వస్తోంది.

ఐవరీ కోస్ట్ లేదా రిప్లబిక్ ఆఫ్ కోస్ట్ ఐవరీ పేరు వినగానే ఆఫ్రికాలోని అందరికీ 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొంది స్వతంత్ర సార్వభౌమాధికార రాజ్యంగా అవతరించిన ఆ దేశ చరిత్రే గుర్తుకువస్తుంది. స్వాతంత్య్రం తర్వాత కాఫీ, కోకో ఉత్పత్తిలో తిరుగులేని శక్తిగా ఎదిగిందీ రాజ్యం. దాదాపు రెండు దశాబ్దాల పాటు పశ్చిమ ఆఫ్రికాలోనే అతి ధనిక రాజ్యంగా గుర్తింపు పొందిందంటే దానికి కారణం కాఫీ, కోకో ఉత్పత్తి, ఎగుమతుల ద్వారా ఆర్జించిన ఆదాయమే. ఆ తర్వాత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఐవరీ కోస్ట్... పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిలో తిరుగులేని పురోగతి సాధించింది. అంతేనా తమ దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడంలోనూ పూర్తిగా సక్సెస్ సాధించింది అక్కడి ప్రభుత్వం.

ప్రస్తుతం ప్రపంచంలోనే జీడిపప్పు ఎగుమతుల్లో అగ్రస్థానం సంపాదించింది ఐవరీ కోస్ట్. రైతులకు గిట్టుబాటు ధర, రాబడి, మార్కెట్ డిమాండ్ అధికంగా ఉండే ఉత్పత్తులను పండించాలనే తీర్మానంతోనే ఈ పురోగతి సాధ్యమైంది. ‘మేం కూడా జీడిపప్పు పండించగలం... అని చెప్పాలనే ఉద్దేశంతోనే జీడిపప్పు పండించడం మొదలెట్టాం. ఇప్పుడు జీడిపప్పు పండించడమే కాదు, దాన్ని ప్రాసెస్ చేయడమూ... అమ్మడమూ... మాకు బాగా తెలుసని నిరూపించుకున్నాం...’ అంటాడు ఆ
దేశ కాజూ- కాటన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అడామా కౌలీబలే. ‘జీడిపప్పు పండించడమే కాకుండా ప్రాసెస్ చేయడమూ ఇక్కడే చేయడం వల్ల చాలామంది నిరుద్యోగులకు పని దొరికిందని’ అంటున్నారాయన.

2013లో 3 లక్షల 80 వేల టన్నుల జీడిపప్పు ఉత్పత్తి చేయగా... 2017లో ఆ సంఖ్య 7 లక్షల 11 వేలకు పెరిగింది. నాలుగేళ్లలో 22 శాతం పెరుగుదల నమోదు చేయడం అంటే ఓ రకంగా రికార్డే. జీడిపప్పు అక్కడి ప్రజలు ‘గ్రే గోల్డ్’ అని పిలుస్తుంటారు. 2018లో 7లక్షల 70వేలకు చేరింది. అయితే ఐవరీ కోస్ట్‌కి కూడా ఇక్కడో సమస్య ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న జీడిపప్పులో కేవలం 6శాతం మాత్రమే ప్రాసెసింగ్ అవుతోందిక్కడ. దీనికి కారణం సరైన పరికరాలు, యంత్రాలు లేకపోవడమే. మిగిలినదంతా ముడిసరుకు రూపంలో వెళుతోంది. దీనివల్ల పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతోందీ ఐవరీ కోస్ట్. దీని కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందింది. ఇందులో 200 మిలయన్ల డాలర్లు జీడిపప్పు ఉత్పత్తి పరిశ్రమ అభివృద్ధికే కేటాయించడం విశేషం. మనదేశానికి వస్తున్న జీడిపప్పులో అధిక భాగం ఈ దేశం నుంచి వస్తున్నదే.
First published: September 15, 2019, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading