GREEN TEA LEAVES ARE ALSO USEFUL FOR HAIR GROWTH THEN LETS LEARN THE PREPARATION PRV
Hair growth tips: జుట్టు ఒత్తుగా పెరగడానికి గ్రీన్ టీ ఆకులూ ఉపయోగపడుతాయట.. తయారీ తెలుసుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
గ్రీన్ టీ ఆరోగ్యం(health) బాగుండటానికి, అంతేకాకుండా బరువు తగ్గిస్తుందని తాగుతుంటారు. అందమైన పొడవాటి జుట్టును పొందడంలో కూడా సహాయపడుతుందని తెలుసుకోవాలి. ఈ గ్రీన్ టీ ఆకులు, నల్ల జీలకర్రల్లో ఏదో ఒకటి వాడితే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఆధునిక యుగంలో మనిషి ఆరోగ్యంగా ఉండటం కంటే అందంగా కనిపించడం కోసమే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. లేనివీ పోనివీ ఫేస్ ప్యాక్‌లు(face packs), క్రీమ్‌లు, హెయిర్ ఆయిల్లు వాడి ఉన్న జుట్టు, అందాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే మనిషి అందానికి కేశాలు కూడా ముఖ్యమే. కానీ, సగటు జీవిలో జుట్టు(hair) రాలిపోతుండటాన్ని(loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే(girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాంటి జుట్టు పొడుగుగా(long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట. ముఖ్యంగా గ్రీన్ టీ ఆకులు(green tea leaves), నల్ల జీలకర్రలు జుట్టు ఒత్తుగా పెరగడానికి సాయపడుతాయంట. వీటిలో ఎలా ఉపయోగించాలో ఒకసారి తెలుసుకుందాం.. గ్రీన్ టీ ఆరోగ్యం(health) బాగుండటానికి, అంతేకాకుండా బరువు తగ్గిస్తుందని తాగుతుంటారు. అందమైన పొడవాటి జుట్టును పొందడంలో కూడా సహాయపడుతుందని తెలుసుకోవాలి. ఈ గ్రీన్ టీ ఆకులు, నల్ల జీలకర్రల్లో ఏదో ఒకటి వాడితే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఉడకబెట్టిన గ్రీన్ టీ ఆకులను నెత్తిమీద నేరుగా పూయవచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ఉత్తేజ పరచడంలో సహాయపడతాయి. జట్లు రాలడాన్ని కూడా నివారిస్తాయి. ఆకులను నేరుగా జుట్టుకు పూయవచ్చు లేదా కొబ్బరి నూనెతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఇది జుట్టుకు నీటిని పట్టించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించిన తర్వాత సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత మంచి షాంపూ, కండీషనర్లతో కడిగేయండి.
నల్ల జీలకర్ర నూనె అధికంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, బలంగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో థైమోక్వినోన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటిహిస్టామైన్. ఇది జుట్టు తిరిగి పెరగడానికి, జుట్టు సన్నగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, ఐరన్, విటమిన్ సి వంటి ఇతర పోషకాలు కూడా జుట్టుకు బాగా పనిచేస్తాయి.2 టేబుల్ స్పూన్ల నల్ల జీలకర్ర నూనె తీసుకొని, తలమీద రుద్దండ. ఆ తరువాత నెత్తికి మసాజ్ చేయాలి. జుట్టు రాలడం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాగా మసాజ్ చేయాలి. నూనెను మూలాల నుంచి చివర వరకు జుట్టుకు రాయాలి. నూనె రాసిన తరువాత జుట్టును 30 నిమిషాల నుంచి గంట వరకు ఆరబెట్టండి. ఆపై షాంపూతో మీ జుట్టును కడగాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల మీ జుట్టు అది ఉత్తేజ పరుస్తుంది. జుట్టులో పెరుగుదల జరుగుతుంది. మంచి చిట్కాలతో ఇలా అప్పుడప్పుడూ చేసుకుంటుంటే మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండటం ఖాయం.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.