ఆహారంలో పచ్చిమిర్చి చేరిస్తే డయాబెటిస్ దూరం...

రోజు క్రమం తప్పకుండా పచ్చిమిర్చీ ఆహారంలో తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండి చక్కెర వ్యాధి దరిచేరదట. అంతేకాదు పచ్చిమిర్చి తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అయి రక్తంలో షుగర్ లెవల్స్ ఆరవై శాతం వరకు నియంత్రించబడతాయని నిపుణులు చెబుతున్నారు.

news18-telugu
Updated: November 14, 2019, 6:29 AM IST
ఆహారంలో పచ్చిమిర్చి చేరిస్తే డయాబెటిస్ దూరం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పచ్చిమిర్చిని తగిన మోతాదులో తీసుకుంటే గొప్ప మేలు చేస్తుంది. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. క్యాప్సికమ్‌, చిన్న మిర్చి, పండు మిర్చి ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇటీవల అధిక బరువు ఉన్న వారు మిర్చిని ఎక్కువగా తీసుకుంటే డయాబెటీస్‌ బారిన పడకుండా ఉంటారని నిపుణులు చేసిన అధ్యయనాల ద్వారా వెల్లడయింది. రోజు క్రమం తప్పకుండా పచ్చిమిర్చీ ఆహారంలో తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండి చక్కెర వ్యాధి దరిచేరదట. అంతేకాదు పచ్చిమిర్చి తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అయి రక్తంలో షుగర్ లెవల్స్ ఆరవై శాతం వరకు నియంత్రించబడతాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చి తినడం వల్ల మేలు చక్కెర వ్యాధి రాని వారికి మాత్రమే కాదు. వచ్చిన వారు కూడా పచ్చిమిర్చిని తినడం వల్ల కూడా ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. అంతేకాదు పచ్చిమిర్చి శరీరంలో రక్తప్రసరణను కూడా సక్రమంగా ఉంచడంతో పాటు గుండెపోటు రాకుండా నివారిస్తుంది. క్యాప్సికమ్‌ మిరప రకం ఆహారంలో తీసుకుంటే ఒంట్లో వాపులు, నొప్పులు తగ్గుతాయి. అలాగే తలనొప్పి, మైగ్రేన్‌, ఒత్తిడి, సైనస్‌ వంటి సమస్యలు దూరం అవుతాయి.

First published: November 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు