Health Tips : శనగలు తింటే బరువు తగ్గుతారు..

బరువు తగ్గేందుకు చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివారు శనగలు తినడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Amala Ravula | news18-telugu
Updated: May 22, 2019, 12:43 PM IST
Health Tips : శనగలు తింటే బరువు తగ్గుతారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరూ సన్నగా మారేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఎన్నోఎక్సర్‌సైజ్‌, మరెన్నో ఆహారపు అలవాట్లు మార్చేస్తున్నారు. అయితే, మన చుట్టూ ఉండే కొన్ని ఆహార పదార్థాలే వెయిట్ లాస్ అయ్యేందుకు మనకు హెల్ప్ చేస్తాయి. అందులో ముఖ్యంగా.. శనగలు ఒకటి. శనగల్లో ప్రోటీన్, ఫైబర్ శాతాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువుని తగ్గించేందుకు సహకరిస్తాయి. శనగలు తినడం వల్ల కడుపు నిండినట్లుగా ఉంటుంది. అంతేకాదు, ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచుతుంది.
ఇందువల్ల శనగలను మీ డైట్‌లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం.

కొన్ని అధ్యయనాల్లో తేలిన విషయమేంటంటే.. శనగలు తీసుకోనివారికంటే.. శనగలు తీసుకున్నవారు త్వరగా బరువు తగ్గుతారని తేలింది. సగం కప్పు శనగల్లో 6 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. అందువల్ల ఇది హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు.
శనగల్లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు, ఇందులోని ఎమినో యాసిడ్స్, ట్రైప్టోఫాన్, సెరోటొనిన్ వంటి విటమిన్స్ మంచినిద్రను అందిస్తాయి. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు శనగలు రెగ్యులర్‌గా తినడం మంచిది.

పాలు, పెరుగు‌కి సమానమైన కాల్షియం శనగల్లో ఉంటుంది. వెజిటేరియన్స్ శనగలని తినడం వల్ల ప్రోటీన్ పొందినవారవుతారు. 100గ్రాముల శనగలను తీసుకోవడం ద్వారా ఏమేం లభిస్తాయంటే.. 164 మిల్లీ గ్రాముల లో కెలరీస్, 8.9 గ్రాముల ప్రోటీన్, 2. 5 గ్రాముల ఫ్యాట్, ఫైబర్ 8.6 గ్రాముల ఫైబర్, ఐరన్ 2.8 గ్రాములు ఉంటుంది.


కాబట్టి.. శనగలే కదా అని తీసేయకుండా మీ ఆహారంలో వీటిని చేర్ంచుకోండి.. ఎన్నో లాభాలు పొందండని చెబుతున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి..
First published: May 22, 2019, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading