హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Obesity: పిల్లలు బరువెక్కుతున్నారు.. చిన్నారుల్లో గణనీయంగా పెరిగిన అధిక బరువు సమస్య..

Obesity: పిల్లలు బరువెక్కుతున్నారు.. చిన్నారుల్లో గణనీయంగా పెరిగిన అధిక బరువు సమస్య..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Obesity Rise in Children: 5 సంత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లల్లో ఊబకాయం సమస్య తీవ్రమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే విడుదల చేసిన సర్వే నివేదిక పలు కీలక విషయాలను వెల్లడించింది.

  • News18
  • Last Updated :

మారుతున్న జీవనశైలి మనిషి ఆరోగ్యాన్ని హరిస్తుంది. క్రమంగా ఇది ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఫలితంగా జీవితం ఆరోగ్య సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నది. ముఖ్యంగా, 5 సంత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లల్లో ఊబకాయం సమస్య తీవ్రమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే విడుదల చేసిన సర్వే నివేదిక పలు కీలక విషయాలను వెల్లడించింది. మొత్తం 22 రాష్ట్రాల్లో సర్వే చేయగా20 రాష్ల్రాలకు చెందిన ఐదేళ్లలోపు పిల్లలు అధిక బరువుతో సతమతమవుతున్నారాని తేలింది. పిల్లలకు శారీరక శ్రమ లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లే దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు.

కాగా, ఈ సర్వే మహారాష్ట్ర(Maharashtra), గుజరాత్(Gujarat), మిజోరాం(Mizoram), త్రిపుర(Tripura), లక్షద్వీప్(Lakshadweep), జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లతో సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఐదేళ్ల లోపు పిల్లలపై జరిగింది. 2015, 2016 మధ్య నిర్వహించిన కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే ప్రస్తుత సర్వే ప్రకారం ఆయా రాష్ట్రాల్లో పిల్లల ఊబకాయం అనేక రెట్లు పెరిగిందని తేలింది. కాగా, గోవా, దాద్రా నగర్ హవేలి, డామన్ డియు ప్రాంతాలకు చెందిన పిల్లల్లో మాత్రమే బరువు తగ్గుదల నమోదైనట్లు సర్వే డేటా స్పష్టం చేసింది.

అత్యధికంగా లఢక్ లో 13.4 శాతం మంది ఐదేళ్లలోపు పిల్లలు అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత లక్షద్వీప్ 10.5 శాతం, మిజోరాం 10 శాతం, జమ్మూ కాశ్మీర్, సిక్కిం రాష్ట్రాల్లో 9.6 శాతం మేర ఐదేళ్ల పిల్లలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని సర్వే స్పష్టం చేసింది.

లాక్డౌన్తో మరింత పెరిగిన ఊబకాయం సమస్య..

2015, 2016లో జరిగిన కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే ఊబకాయం సమస్య పిల్లల్లోనే కాకుండా పెద్దవారిలోనూ పెరిగిందని స్పష్టమైంది. కాగా, 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మహిళల్లో, 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పురుషుల్లో ఊబకాయం సమస్య తీవ్రంగా ఉందని సర్వే నివేదిక తెలిపింది. అంతేకాక, ప్రతి వంద మందిలో సుమారు నలుగురు పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారని, కేవలం మూడేండ్లలోనే ఊబకాయం బాధితుల సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని తేలింది. ఇది చాలా ఆందోళనకర పరిణామని, దీనిపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడం, స్మార్ట్ఫోన్లపై ఎక్కువ సమయం గడపడం, వ్యాయామం చేయకపోవడం వంటివి ఊబకాయం సమస్య పెరగడానికి ప్రధాన కారణాలుగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు పేర్కొన్నారు. వీటితో పాటు లాక్డౌన్ బరువు పెరుగుదలకు దోహదం చేసిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ కారణంగా పిల్లలలో ఊబకాయం సమస్య మరింత పెరిగింది. ముఖ్యంగా పాఠశాలలు మూసివేయడంతో, పిల్లలలో శారీరక శ్రమ తగ్గిందని, ఇది క్రమంగా బరువు పెరుగుదలకు కారణమైందని వారు పేర్కొన్నారు.

First published:

Tags: Children