Google Doodle: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? ఫ్రెంచ్ నటుడికి ఘన నివాళి...

ఫ్రెంచ్ నటుడు, నాటక రచయిత మోలియేర్‌ని స్మరిస్తూ నేడు గూగుల్ డూడుల్‌ని రూపొందించింది.

Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 2:34 PM IST
Google Doodle: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? ఫ్రెంచ్ నటుడికి ఘన నివాళి...
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 2:34 PM IST
ప్రముఖ ఫ్రెంచ్ నటుడు, నాటకరచయిత, రచయిత అయిన మోలియేర్‌ని స్మరించుకుంటూ గూగుల్ డూడుల్‌ని రూపొందించింది. తన నాటకాలు, రచనలతో సమాజంలోని చెడుని పారద్రోలేందుకు మోలియేర్‌ ఎంతగానో కృషి చేశాడు.
జనవరి 15, 1622లో ప్యారిస్‌లో జన్మించిన ఆయన.. ఫిబ్రవరి 17, 1673 న మరణించాడు. ఆరుగురి సంతానంలో పెద్దవాడిగా జన్మించిన మోలియేర్‌ అసలు పేరు జాన్ బాప్టిస్ట్ పోక్యులన్. 1643లో ఇటస్ట్రేరియన్స్ అనే థియేటర్‌ని ప్రారంభించి అందులో కొన్ని నాటకాలను ప్రదర్శించేవాడు. అనంతరం, వివిధ ప్రాంతాలను సందర్శించి రచనలు ప్రారంభించాడు.
1658లో ప్యారిస్‌కి తిరిగివచ్చిన మోలియేర్‌ నాటకాలు వేయడం ప్రారంభించారు. అందులో ముఖ్యమైనవి The school for Husbands 1661, the school for wives 1662, Tartuffe 1664, The Misanthrope 1666, The Bourgeois Gentleman 1670, The Learned ladies 1672, The Imanginari Invalid 1673.

ఇందులో అతని చివరి నాటకం The Imaginary Invalid ఫిబ్రవరి 10, 1673న జరిగింది. అందుకే ఈ రోజునే గూగుల్ అతన్ని స్మరిస్తూ డూడుల్‌ని క్రేయట్ చేసింది. ఇతన నాటకాలు 16వ శతాబద్ధంలో చాలా ప్రజాదరణ పొందాయి. ప్రతీ చోటికి వెళ్లి తన హాస్యచతురతతో కూడిన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసేవారు.

ముఖ్యంగా షేక్ స్పియర్, మోలియేర్‌ మధ్య చాలా పోలికలున్నాయి. ఇద్దరూ కూడా వారి నాటకాల్లో దిట్టలు.. అదే విధంగా రచనా రంగంలో ఎన్నో కొత్త పదప్రయోగాలు చేసేవారు.
ఫ్రెంచ్‌లోని కామెడీ రచయితలందరిలో మోలియేర్‌ ముందు వరసులో ఉంటారు. ఇతని వ్యంగ్య నాటకాలు, కామెడీలు కొత్తతరాన్ని కూడా అలరిస్తాయి.
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు