టెక్నాలజీ దిగ్గడం గూగుల్ గతేడాది ఓ షాకింగ్ ప్రకటన చేసింది. తన సోషల్ నెట్వర్క్ గూగుల్ ప్లస్ ని క్లోజ్ చేస్తానని తెలిపింది. దానికి సంబంధించిన చివరి తేదీ ఎప్పుడో ఇప్పుడు ప్రకటించింది. ఏప్రిల్ 2న గూగుల్ ప్లస్‌ను మూసివేస్తామని తెలిపింది. గూగుల్ ప్లస్‌లో చేరిన ఓ ప్రైవసీ బగ్ (వైరస్)... 5.25 కోట్ల మంది యూజర్ల అకౌంట్లపై ప్రభావం చూపింది. దాంతో గూగుల్ ప్లస్‌ను మూసేయాలని నిర్ణయించుకుంది గూగుల్. నిజానికి ఈ ఏడాది ఆగస్టు వరకూ సర్వీస్ కొనసాగించాలని అనుకున్నా... సెక్యూరిటీ బగ్ కారణంగా... ముందుగానే మూసేస్తోంది. మరి గూగుల్ ప్లస్ మూసేస్తే... అందులో మన డేటా సంగతేంటి? డీలీట్ అయిపోతుందా?

ప్రతీకాత్మక చిత్రం
గూగుల్ ముందే చెప్పింది. గూగుల్ ప్లస్ లోని డేటా, ఫొటోలు, వీడియోలు అన్నింటినీ డిలీట్ చేస్తామని ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచీ ఈ పని మొదలవుతుంది. అలాగే గూగుల్ ప్లస్ నుంచీ బ్లాగర్ లో పోస్ట్ చేసే కామెంట్లను ఫిబ్రవరి 4 నుంచీ తీసివేస్తోంది. ఇప్పటివరకూ మనం పోస్ట్ చేసిన అన్నింటినీ డిలీట్ చేస్తుంది. అవి కావాలనుకునేవారు... వాటిని ఈలోగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫొటోలను, వీడియోలను గూగుల్ ఫొటోస్‌లో సేవ్ చేసుకోవచ్చు. అందులో సేవ్ చేసేవి మాత్రం డిలీట్ కావు.
ఫిబ్రవరి 4 నుంచీ గూగుల్ ప్లస్‌లో న్యూ ప్రొఫైల్స్, పేజీలు, ఈవెంట్ కమ్యూనిటీస్ క్రియేషన్‌ను ఆపేశారు. ఎవరికైనా అనుమానాలుంటే క్లారిఫై చేసుకోవడానికి FAQ పేజీని కూడా క్రియేట్ చేసింది. అందులో చాలా ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. పైకి వైరస్ వల్ల క్లోజ్ చేస్తున్నట్లు గూగుల్ చెబుతున్నా... గూగుల్ ప్లస్ వల్ల ఆశించినంత యాడ్ రెవెన్యూ రాకపోవడం వల్లే మూసేస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతోంది. కంపెనీ నుంచీ మాత్రం ఈ యాంగిల్లో ప్రకటనేదీ రాలేదు.
మరో ముఖ్యమైన విషయమేంటంటే... G Suite యూజర్లు మాత్రం గూగుల్ ప్లస్‌ని ఏప్రిల్ 2 తర్వాత కూడా వాడగలరు. వాళ్లకు ఎలాంటి సమస్యా ఉండదు. వాళ్ల కోసం కంపెనీ త్వరలో కొత్త డిజైన్‌తో గూగుల్ ప్లస్‌ను రూపొందించనున్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి :
లోక్‌సభ ఎన్నికలకు ఈసీ సిద్ధం... ఇవాళ సాయంత్రమే నోటిఫికేషన్
ఆండ్రాయిడ్ గేమ్స్ ని కంప్యూటర్ లో ఆడాలా? ఇదిగో ఫ్రీ ఆప్షన్
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా... ఇలా చెయ్యండి
మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి
డాక్టర్ బార్బెర్... 1912లో సంచలనం సృష్టించిన ఐడెంటిటీ థెఫ్ట్ కేసు