ఈ ఏడాది ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేద్దామనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. 2021లో ఫుల్లుగా లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. ఇప్పటికే ఓ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారంతా. మొత్తం 15 లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. శనివారం, ఆదివారం వీకాఫ్ ఉన్నవారికైతే పండగే. సెలవులతో కలిపి లాంగ్ వీకెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు. టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఈ ఏడాది లాంగ్ వీకెండ్స్ ఎప్పుడు వచ్చాయో తెలుసుకోండి.
జనవరిలో మూడు లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. అందులో ఒకటి అయిపోయినట్టే. జనవరి 1 శుక్రవారం న్యూ ఇయర్ డే, జనవరి 2 శనివారం, జనవరి 3 ఆదివారంతో ఓ లాంగ్ వీకెండ్ అయిపోయింది. ఇక జనవరి 14 గురువారం మకర సంక్రాంతి రోజున సెలవు. జనవరి 15 శుక్రవారం సెలవు పెట్టుకుంటే జనవరి 16 శనివారం, జనవరి 17 ఆదివారం కలిసొస్తాయి. మొత్తం నాలుగు రోజులు సెలవుల్లో ఉండొచ్చు. ఇక జనవరి 23 శనివారం, జనవరి 24 ఆదివారం ఎలాగూ సెలవే. జనవరి 25న సోమవారం సెలవు పెట్టుకుంటే జనవరి 26న మంగళవారం రిపబ్లిక్ డే సెలవు కలిసొస్తుంది. ఇలా నాలుగు రోజులు సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లొచ్చు.
ఫిబ్రవరిలో రెండు లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 13 శనివారం, ఫిబ్రవరి 14 ఆదివారం సెలవు. ఫిబ్రవరి 15 సోమవారం సెలవు పెట్టుకుంటే ఫిబ్రవరి 16 మంగళవారం వసంతపంచమి సెలవు కలిసొస్తుంది. ఇక మార్చి 11 గురువారం మహాశివరాత్రి సెలవు. మార్చి 12న శుక్రవారం సెలవు పెట్టుకుంటే మార్చి 13 శనివారం, మార్చి 14 ఆదివారం కలిసొస్తుంది. మార్చిలో మరో లాంగ్ వీకెండ్ ఉంది. మార్చి 27 శనివారం, మార్చి 28 ఆదివారం సెలవు. మార్చి 29 సోమవారం హోలీ సందర్భంగా సెలవు.
January 2021 Bank Holidays: జనవరిలో బ్యాంకులకు 10 సెలవులు... ఎప్పుడంటే
Telangana Holidays 2021: తెలంగాణలో 2021 హాలిడేస్ లిస్ట్ ఇదే... సెలవులు ఎప్పుడంటే
ఏప్రిల్‌లో ఓ లాంగ్ వీకెండ్ ఉంది. ఏప్రిల్ 2 శుక్రవారం గుడ్ ఫ్రైడే హాలిడే. ఏప్రిల్ 3 శనివారం, ఏప్రిల్ 4 ఆదివారం సెలవు. మే లో ఒక లాంగ్ వీకెండ్ ఉంది. మే 13 గురువారం రంజాన్ పండుగ సెలవు. మే 14 శుక్రవారం సెలవు తీసుకుంటే మే 15 శనివారం, మే 16 ఆదివారం సెలవు. జూలైలో రెండు లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. జూలై 10 శనివారం, జూలై 11 ఆదివారం సెలవు. జూలై 12 సోమవారం రథయాత్ర సందర్భంగా సెలవు. ఇక జూలై 17 శనివారం, జూలై 18 ఆదివారం సెలవు. జూలై 19 సోమవారం సెలవు తీసుకుంటే జూలై 20 మంగళవారం బక్రీద్ హాలిడే.
ఆగస్ట్‌లో ఒక లాంగ్ వీకెండ్ ఉంది. ఆగస్ట్ 28 శనివారం, ఆగస్ట్ 29 ఆదివారం సెలవు. ఆగస్ట్ 30 సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా సెలవు. సెప్టెంబర్‌లో ఒక లాంగ్ వీకెండ్ ఉంది. సెప్టెంబర్ 10 శుక్రవారం వినాయకచవితి సెలవు. సెప్టెంబర్ 11 శనివారం, సెప్టెంబర్ 12 ఆదివారం సెలవు. అక్టోబర్‌లో కూడా ఒక లాంగ్ వీకెండ్ ఉంది. అక్టోబర్ 15 శుక్రవారం దసరా సెలవు. అక్టోబర్ 16 శనివారం, అక్టోబర్ 17 ఆదివారం సెలవు.
2021 Bank Holidays List: 2021 లో బ్యాంకులకు 100 సెలవులు... ఎప్పుడెప్పుడో తెలుసుకోండి
Cylinder Booking on Paytm: పేటీఎం యాప్ ఉందా? సింపుల్‌గా సిలిండర్ బుక్ చేయండిలా
ఇక నవంబర్‌లో ఒక లాంగ్ వీకెండ్ ఉంది. నవంబర్ 19 శుక్రవారం గురునానక్ జయంతి సందర్భంగా సెలవు. నవంబర్ 20 శనివారం, నవంబర్ 21 ఆదివారం సెలవు. డిసెంబర్‌లో ఒక లాంగ్ వీకెండ్ ఉంది. డిసెంబర్ 24 శుక్రవారం సెలవు. డిసెంబర్ 25 శనివారం క్రిస్మస్ హాలిడే. డిసెంబర్ 26 ఆదివారం సెలవు.
ఇలా ఈ ఏడాది మొత్తం 15 లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. 2020 లో కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా టూర్లకు వెళ్లలేనివారికి ఈ ఏడాది మంచి ఛాన్స్ ఇస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Holidays, Best tourist places, Tourism