Araku Train: రేపటి నుంచి విశాఖ-అరకు స్పెషల్ ట్రైన్... టైమింగ్స్ ఇవే

Vishakapatnam Araku Special Train | విశాఖ-అరకు స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 1 నుంచే ప్రయాణికులకు సేవలు అందించనుంది. 2019 డిసెంబర్ చివరి వరకు స్పెషల్ రైలు అందుబాటులో ఉంటుంది.

news18-telugu
Updated: September 30, 2019, 5:47 PM IST
Araku Train: రేపటి నుంచి విశాఖ-అరకు స్పెషల్ ట్రైన్... టైమింగ్స్ ఇవే
Araku Train: రేపటి నుంచి విశాఖ-అరకు స్పెషల్ ట్రైన్... టైమింగ్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం, image: wikimedia)
news18-telugu
Updated: September 30, 2019, 5:47 PM IST
అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. విశాఖపట్నం, అరకు మధ్య మరో ప్రత్యేక రైలును నడపనుంది ఈస్ట్ కోస్ట్ రైల్వే. అక్టోబర్ 1 నుంచి స్పెషల్ ట్రైన్ ప్రయాణికులకు సేవలు అందించనుంది. శీతాకాలంలో అరకు లోయకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీకి ఇప్పుడు ఉన్న రైళ్లు ఏమాత్రం సరిపోవు. అందుకే ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. విశాఖ-అరకు స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 1 నుంచే ప్రయాణికులకు సేవలు అందించనుంది. 2019 డిసెంబర్ చివరి వరకు స్పెషల్ రైలు అందుబాటులో ఉంటుంది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం విశాఖ-అరకు ప్రత్యేక రైలు నెంబర్ 08517. ఉదయం 8.10 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరుతుంది. అరకుకు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది. అదే రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ నుంచి బయల్దేరుతుంది. సాయంత్రం 6 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అరకు టూర్ వెళ్లాలనుకునేవారు వేళలు చూసుకొని రైలు టికెట్లు బుక్ చేసుకోవాలి. విశాఖ-అరకు ప్రత్యేక రైలు సింహాచలం, కొత్తవలస, బొర్రాగుహలు రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది. ఈ రైలులో 8 జనరల్ సెకండ్ క్లాస్, 2 సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లు ఉంటాయి.ఇక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో విశాఖపట్నం-అరకు స్పెషల్ రైలు ఛార్జీలు చూస్తే స్లీపర్ రూ.230, థర్డ్ ఏసీ రూ.755, సెకండ్ ఏసీ రూ.1015.

ఇక అరకు టూర్ వెళ్లే ప్రయాణికులకు మరో శుభవార్త కూడా ఉంది. ఇప్పటికే విశాఖ-అరకు మధ్య నడుస్తున్న విస్టాడోమ్ రైలులో 5 కొత్త కోచ్‌లు రానున్నాయి. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కొద్దిరోజుల క్రితం ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన సమయంలో ఈ హామీ ఇచ్చారు. అరకు టూరిజం పెరుగుతున్నందున అందుకు తగ్గట్టుగా కొత్త కోచ్‌లు ఏర్పాటుచేయబోతున్నట్టు తెలిపారు. దాంతో పాటు విశాఖ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి నేపాల్ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC: ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
Loading...
IRCTC: తిరుమల తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ వివరాలివే...
First published: September 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...