టీవీ చూడటం ఆపేస్తే ఆరోగ్యం మీ సొంతం... తేల్చిన అధ్యయనం

వారానికి ఏడు గంటలలోపు టీవీ చూసేవారితో పోలిస్తే టీవీ ఎక్కువ చూసేవారిలో ధమనుల్లో సమస్యలు వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువ. అది గుండెపోటుకు దారితీస్తుంది.

news18-telugu
Updated: March 9, 2019, 4:12 PM IST
టీవీ చూడటం ఆపేస్తే ఆరోగ్యం మీ సొంతం... తేల్చిన అధ్యయనం
టీవీ చూడటం ఆపేస్తే ఆరోగ్యం మీ సొంతం... తేల్చిన అధ్యయనం
news18-telugu
Updated: March 9, 2019, 4:12 PM IST
అసలు మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది ఏంటో తెలుసా? మీరు ఎక్కువగా టీవీ చూడటం. అవును... టీవీ ఎక్కువగా చూసేవాళ్లలో అధిక రక్తపోటు, డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువని, అవి హృదయ సమస్యలకు దారితీస్తాయని తేల్చింది ఓ అధ్యయనం. మీ హృదయం పదిలంగా ఉండాలంటే టీవీ ఆఫ్ చేసెయ్యండి. దానికి బదులుగా ఇంకా ఏదైనా పనిచేయండి. మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. వీటి వల్ల మీకు ఆరోగ్యం వస్తుందని ఆ అధ్యయనం వెల్లడించింది. గ్రీస్‌లోని నేషనల్ కపోడిస్ట్రియన్ యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్‌‌లో కార్డియాలజిస్ట్ బృందం ఈ అధ్యయనం జరిపింది. వారానికి 21 గంటలు టీవీ చూసేవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం 68 శాతం, మధుమేహం వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువ అని ఆ అధ్యయనం సారాంశం. వారానికి ఏడు గంటలలోపు టీవీ చూసేవారితో పోలిస్తే టీవీ ఎక్కువ చూసేవారిలో ధమనుల్లో సమస్యలు వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువ. అది గుండెపోటుకు దారితీస్తుంది.

ఎక్కువసేపు కూర్చొని పనిచేయడాన్ని తగ్గించాల్సిన ప్రాముఖ్యతను మా అధ్యయనం మరోసారి గుర్తుచేస్తోంది. టీవీ ఆఫ్ చేసి సోఫాను విడిచిపెట్టి ఏవైనా యాక్టివిటీస్ చేయడం మంచిది. టీవీ చూస్తూ కూర్చోవడం కన్నా శక్తి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేని ఇంటి పనులు, స్నేహితులను కలవడం లాంటివి చేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.
కార్డియాలజిస్ట్


టీవీ చూడకతప్పదని అనుకుంటే కూర్చుని టీవీ చూడటం కన్నా ట్రెడ్‌మిల్ ఎక్సర్‌సైజ్, స్ట్రెచింగ్ బ్యాండ్స్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి యాక్టివిటీస్‌ చేయడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. వీటితో పాటు మంచి శక్తినిచ్చే బ్రేక్‌ఫాస్ట్ గుండెకు మంచిదని, అస్సలు బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం లేదా తక్కువ తినడం వల్ల హృదయ సమస్యలు వస్తాయన్నారు. 2000 మందితో జరిపిన అధ్యయన ఫలితాలను అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌లో నిర్వహించనున్న అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ 68వ వార్షిక శాస్త్రీయ సమావేశంలో ప్రదర్శించనున్నారు.Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:
Loading...
LIC AABY: ఎల్ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజన... ఈ స్కీమ్‌తో మీకెంత లాభం?

Credit Card: క్రెడిట్ కార్డు వాడేప్పుడు ఈ 8 తప్పులు చేస్తున్నారా?

SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? మారిన ఎస్‌బీఐ రూల్స్ ఇవే
First published: March 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...