దసరా వేడుకల్లో వారు పెద్దల సమాధులను పూజిస్తారు..

గోండురాజుల పూర్వవైభవం చారిత్రక కట్టడాలు కనుమరుగై పోతున్నాయని శిథిలావస్థకు చేరుకుంటున్నాయని వారి వారసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: October 8, 2019, 9:50 PM IST
దసరా వేడుకల్లో వారు పెద్దల సమాధులను పూజిస్తారు..
గోండు రాజుల సమాధి వద్ద సీతాగొంది ఆత్రం వంశస్తులు
  • Share this:
దసరా సందర్భంగా అందరూ దేవుళ్లను పూజిస్తుంటే వాళ్ళు మాత్రం తమ పూర్వికులను పూజిస్తారు.
తాతల కాలంగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం గోండురాజుల కోటలో నిర్వహించే దసరా వేడుకలు చాలా ప్రత్యేకం. ఇలా దసరా రోజు దేవుళ్లను కాకుండా తమ పూర్వికులను పూజించేవారు సీతాగొంది ఆత్రం వంశస్థులు. గోండురాజుల కాలం నుంచి పాలించిన తమ రాజులను నేటికి గుర్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని గోండు రాజుల కోట ఉంది. 18వ శతాబ్దంలో సీతాగొంది ఆత్రం వంశానికి చెందిన హనుమంతరాయుడు అనే గోండురాజు ఈ కోటను పరిపాలించాడు. గోండురాజుల పరిపాలన కొనసాగుతున్న క్రమంలో నిజాం కాలంలో హనుమంతరాయుడి మరణాంతరం వారి సతీమణీ పరిపాలించగా అప్పటి కాలంలో నిజాం ప్రభువులకు గోండురాజులకు ఏర్పడిన వైరుధ్యం వల్ల గోండులు కోటలు వదిలి అడవికి వలస వెళ్ళారని అలా వారి తాతల కాలంగా వారి మరణంతరం ఇలా ప్రతియేటా వారిని స్మరిస్తూ దసరా సందర్భంగా వారిని గుర్తు చేస్తు పూజలు చేయడం అనవాయితీగా వస్తోంది. సీతాగొంది ఆత్రం వంశస్థులు హనుమంత రాయుడి అనంతరం వారి మనుమడు రాజ్ దేవ్ షా... దేవ్ షా రాజ్ .. పరంపరగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

నేడు దసరా సందర్భంగా ఉట్నూర్ లోని వారి ముని మనుమడు సీతాగొంది ఆత్రం సుధాకర్ షా పూజలు నిర్వహించారు. గోండుల సంప్రదాయం ప్రకారం డోలు వాయిస్తూ రాజుల కోటలో చేరుకొని వారి తాతల సమాధి వద్ద పూజలు నిర్వహించి ప్రతీకగా జండా ఎగరవేశారు. తమ గోండురాజుల పూర్వవైభవం చారిత్రక కట్టడాలు కనుమరుగై పోతున్నాయని శిథిలావస్థకు చేరుకుని కనుమరుగయిపోవడంతో పాటు మరి కొందరు పూరాతన కట్టడాలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహిస్తూ కోటను కొల్లగొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ గోండురాజుల కట్టడాలను గుర్తించి వాటిని సంరక్షించాలని కోరారు. రెండేళ్ళ కింద ఉట్నూర్ ఐటిడిఏ పిఓ ఆర్వీ కర్ణన్ ఈ కోటను గుర్తించి శుభ్రం చేయించారు. ఇక్కడ చిన్న పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు కూడా పరిశీలించి వెళ్లారు. అయినా ఇంకా పనులు వేగవంతం కాలేదని ఎవరు దీన్ని పట్టించుకోలేదని, అందరూ మళ్ళీ మరిచిపోయారని ఇప్పటికైనా స్పందించి ఈ కోటను పరిరక్షించాలని వారు కోరుతున్నారు.

(కట్టా లెనిన్, ఆదిలాబాద్ కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: October 8, 2019, 9:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading