గోవా వెళ్తున్నారా? స్విమ్మింగ్‌కు ఓకే... సెల్ఫీ కష్టమే...

గోవా బీచ్‌లు సేఫ్ కాదంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. గోవా టూరిజం దెబ్బతినకుండా ఉండేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం 'దృష్టి లైఫ్ సేవింగ్ లైఫ్‌గార్డ్' ఏజెన్సీని రంగంలోకి దించింది. ఏజెన్సీ ప్రతినిధులు గోవాలోని మొత్తం బీచ్‌లు పరిశీలించి స్విమ్మింగ్ స్పాట్స్‌తో పాటు 'నో సెల్ఫీ' జోన్స్ గుర్తించారు. ఆ బీచ్‌లల్లో మొత్తం 24 'నో సెల్ఫీ' జోన్స్‌‌తో ఉన్న స్విమ్మింగ్ జోన్స్ ప్రకటించారు.

news18-telugu
Updated: November 1, 2018, 12:34 PM IST
గోవా వెళ్తున్నారా? స్విమ్మింగ్‌కు ఓకే... సెల్ఫీ కష్టమే...
ప్రతీకాత్మక చిత్రం (Photo courtesy: AFP Relaxnews/ JOEL SAGET)
  • Share this:
గోవా... ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం. ఇండియన్స్‌కి ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది గోవా టూర్ వెళ్తుంటారు. కుర్రకారుకి వీకెండ్ స్పాట్ కూడా. ఇకపై గోవా వెళ్లేవారికి ఓ గుడ్ న్యూస్... ఓ బ్యాడ్ న్యూస్. గోవా బీచ్‌లో స్విమ్మింగ్‌ చేయాలనుకునేవారికి ఇకపై ఏ అడ్డంకీ ఉండదు. కానీ... అక్కడ సెల్ఫీలు తీసుకుంటామంటే మాత్రం అస్సలు కుదరదు. ఎందుకంటే అక్కడ 24 'నో సెల్ఫీ' జోన్స్ ఏర్పాటు చేశారు.

గోవా బీచ్‌లు సేఫ్ కాదంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. గోవా టూరిజం దెబ్బతినకుండా ఉండేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం 'దృష్టి లైఫ్ సేవింగ్ లైఫ్‌గార్డ్' ఏజెన్సీని రంగంలోకి దించింది. ఏజెన్సీ ప్రతినిధులు గోవాలోని మొత్తం బీచ్‌లు పరిశీలించి స్విమ్మింగ్ స్పాట్స్‌తో పాటు 'నో సెల్ఫీ' జోన్స్ గుర్తించారు. ఆ బీచ్‌లల్లో మొత్తం 24 'నో సెల్ఫీ' జోన్స్‌‌తో ఉన్న స్విమ్మింగ్ జోన్స్ ప్రకటించారు. గురువారం(నవంబర్ 1) నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి.

గోవా వెళ్తున్నారా? స్విమ్మింగ్‌కు ఓకే... సెల్ఫీ కష్టమే!, Goa Beaches to Reopen for Swimming from Today with 24 ‘No Selfie’ Zones

'దృష్టి లైఫ్ సేవింగ్ లైఫ్‌గార్డ్' ఏజెన్సీ తరఫున నిత్యం 600 మంది లైఫ్‌గార్డ్ ఫోర్స్ అందుబాటులో ఉంటారు. 'నో సెల్ఫీ' జోన్స్‌లో పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవడం ఆ ఏజెన్సీ బాధ్యత. అంతే కాదు... వారాతవరణం, సముద్ర పరిస్థితులను అంచనా వేసి... సేఫ్ స్విమ్-జోన్స్‌ని నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి గోవాలో చాలావరకు బీచ్‌లు సురక్షితమే. కానీ పర్యాటకుల అజాగ్రత్త వల్ల ప్రమాదాల బారిన పడుతుంటారు. అందుకే దృష్టి ప్రతినిధులు భద్రతా చర్యలు చేపట్టారు.గోవా బీచ్‌లో ఎరుపు, పసుపు జెండాలు కనిపించే ప్రాంతాలే స్విమ్-జోన్స్. ఎరుపు రంగు జెండాలు కనిపిస్తే అవి నాన్ స్విమ్ జోన్స్. సో... వీటిని బట్టి స్విమ్ జోన్స్ గుర్తించి మీరు ఈత కొట్టొచ్చు. కానీ సెల్ఫీలు మాత్రం తీసుకోవడం కుదరదు.

ఇవి కూడా చదవండి:రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసా?

Video: ప్యాలెస్ ఆన్ వీల్స్: ప్రపంచంలోనే నాలుగో లగ్జరీ ట్రెయిన్!

Photos: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్

Video: టూర్ వెళ్తే ఈ 10 తీసుకెళ్తున్నారా?

Video: సోలో టూర్ వెళ్లేవారికి 15 టిప్స్!
First published: November 1, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు