GLOBAL IODINE DEFICIENCY DAY 2021 REASONS FOR IODINE DEFICIENCY IN INDIA AND WAYS TO COUNTER IT GH SK
Iodine Deficiency Day: భారత్‌లో అయోడిన్ లోపానికి కారణాలు.. పాటించాల్సిన చిట్కాలు ఇవే
Iodine Deficiency Day: శరీరంలో అయోడిన్ లోపిస్తే అది జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది. మెదడు ఎదుగుదల తగ్గి బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా విడుదల కాకపోతే గాయిటర్ (థైరాయిడ్ గ్రంధి ఉబ్బటం) అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
Iodine Deficiency Day: శరీరంలో అయోడిన్ లోపిస్తే అది జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది. మెదడు ఎదుగుదల తగ్గి బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా విడుదల కాకపోతే గాయిటర్ (థైరాయిడ్ గ్రంధి ఉబ్బటం) అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
మనుషులకు అయోడిన్ (Iodine) అనేది ఉప్పు (Salt) రూపంలో లభిస్తుంది. మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్(Thyroid hormone)ను నియంత్రించడానికి అయోడిన్ ఎంతో అవసరం. ఈ హార్మోన్ ఒక వ్యక్తి పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. అయోడిన్ సాయంతోనే థైరాయిడ్ గ్రంధి శరీరానికి అవసరమైన అన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది. ఒకవేళ అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయదు. ఫలితంగా అనేక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మన శరీరానికి పోషకాలు ఎంత అవసరమో అయోడిన్ మినరల్ కూడా అంతే అవసరం. అయోడిన్ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21న వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డే ( Iodine Deficiency Day) జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ అయోడిన్ లోపం దినోత్సవం సందర్భంగా.. అయోడిన్ ఎందుకు లోపిస్తుంది? భారతదేశంలో అయోడిన్ లోపం ఎలా ఉంది? అయోడిన్ లోపాన్ని ఎలా నివారించాలి? తెలుసుకుందాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జాతీయ ఉప్పు అయోడైజేషన్ కార్యక్రమాల ద్వారా అయోడిన్ లోపం ప్రభావాల పట్ల అవగాహన కల్పించేందుకు 1980 కాలం నుంచి కృషి చేస్తోంది. యూనిసెఫ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ కంట్రోల్ ఆఫ్ అయోడిన్ డెఫిషియెన్సీ డిజార్డర్స్.. అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా 66 శాతం ఇళ్లకు అయోడైజ్డ్ ఉప్పును అందించగలుగుతోంది.
శరీరంలో అయోడిన్ లోపిస్తే అది జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది. మెదడు ఎదుగుదల తగ్గి బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా విడుదల కాకపోతే గాయిటర్ (థైరాయిడ్ గ్రంధి ఉబ్బటం) అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. థైరాయిడ్ గ్రంథి అనేది హార్మోన్లను సక్రమంగా విడుదల చేయడానికి మన శరీరంలోని స్వల్ప మొత్తంలో అయోడిన్ సేకరిస్తుంది. అందుకే మన శరీరానికి తగినంత అయోడిన్ అందించడం చాలా ముఖ్యం.
భారతదేశంలో సుమారు 200 మిలియన్ల మంది ప్రజల్లో ఐరన్ డెఫిషియన్సీ డిజార్డర్ (IDD) బారిన పడే ముప్పు చాలా ఎక్కువగా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. 1962లో భారతదేశం నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్ (NGCP) ను తీసుకొచ్చింది. దీన్ని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేసింది. ఇది అన్ని ఇళ్లలో అయోడైజ్డ్ ఉప్పును తగినంతగా వినియోగించేలా ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశంలో మొత్తం గాయిటర్ రేట్ (TGR) గణనీయంగా తగ్గింది.
* భారతదేశంలో అయోడిన్ లోపం ప్రాబల్యం ఎక్కువగా ఉండటానికి కారణాలు ఏంటి
భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మట్టిలో అయోడిన్ చాలా తక్కువగా లభిస్తుంది. ఇది మన దేశంలో అయోడిన్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. దేశంలో అయోడైజ్డ్ ఉప్పు వినియోగం గతేడాది వరకు 71 శాతంగా మాత్రమే ఉంది. అయోడిన్ ముఖ్యంగా ఉప్పులో లభిస్తుంది. కానీ ఇళ్లలో వాడే ఉప్పులో 30 శాతం వంటలో నిరుపయోగంగా మారుతుంది. 70 శాతం మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. ఈ లోపాన్ని తగ్గించడంలో అయోడిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
* అయోడిన్ లోపం తగ్గించడానికి చిట్కాలు
- అయోడైజ్డ్ ఉప్పును రోజూ 10 గ్రాముల చొప్పున తీసుకోవాలి.
- బ్రెడ్(bread)లో దాదాపు 100 గ్రాముల అయోడిన్ కంటెంట్ ఉంటుంది. రోజుకు రెండు బ్రెడ్ ముక్కలు తినడం ద్వారా అయోడిన్ లోపాన్ని అధిగమించవచ్చు.
- అయోడిన్ కోసం మాత్రమే కాకుండా ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం కోసం రోజు పాలు తాగాలి.
- సీఫుడ్ నుంచి అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. సీఫుడ్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. మట్టి(soil)లో, సముద్రపు నీటిలో అయోడిన్ ఉందని అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ వెల్లడించింది.
- పిల్లలలో అయోడిన్ మినరల్ పెంచడానికి గుడ్లు బాగా ఉపయోగపడతాయి.
- అరటి, స్ట్రాబెర్రీలు వంటి పండ్లు.. స్వీట్ పొటాటో (sweet potato), పాలకూర వంటి కూరగాయలలో అవసరమైన మెదడు పోషక ఫోలేట్ ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.