Home /News /life-style /

GIVING YOUR BABY FRESHLY SQUEEZED MILK IS LIKE PUSHING THEM SICK PRV

Milk for Children: అప్పుడే పితికిన పాలను పిల్లలకు తాగిస్తున్నారా? మీ పిల్లలను అనారోగ్యంలోకి నెడుతున్నట్లే.. ఏం చేయాలంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంతమంది తెలిసీ తెలియక పాలు పిండగానే అలాగే త్రాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచి పిండగానే అలాగే పచ్చిపాలను త్రాగడం(drink) మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఆ పాలల్లో ప్రమాదకర మైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ.

ఇంకా చదవండి ...
    పిల్లలకు పాలు(milk) పట్టడం చాలా అవసరం. కొన్ని నెలల వరకు అమ్మపాలు చిన్నారులకు శ్రేయస్కరం. అయితే కొద్దిమందిలో పాలు ఎక్కువగా రావు. దీంతో అలాంటి వారు పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్‌ మిల్క్‌ లభిస్తాయి. ఆవు(cow) పాలు పిల్లలకు అయితే శ్రేష్టమయినవే. గేదె, మేక  పాలతో పోలిస్తే ఆవు పాలను పిల్లలకు మొదటి ప్రియారిటీ(first priority)గా ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొంతమంది తెలిసీ తెలియక పాలు పిండగానే( freshly squeezed milk) అలాగే త్రాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలుఅంటారు. పొదుగు నుంచి పిండగానే అలాగే పచ్చిపాలను త్రాగడం(drink) మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఆ పాలల్లో ప్రమాదకర మైన సూక్ష్మక్రిములు(harmful germs) ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను, వ్యాధి(disease)ని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా వేడి చేసి పొంగిన తర్వాతనే పిల్లల(child)కు త్రాగించడం ఆరోగ్యకరం(healthy). పాశ్చరైజ్డ్‌ మిల్క్‌ను కనీసం పదినిముషాలయినా కాచినట్లయితే(boil) అందులోని బాక్టీరియా నశిస్తుంది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు త్రాగించాలి.

    నిల్వ చేసినవి ఎక్కువగా వద్దు..

    చల్లారిపోయిన పాలను, నిల్వ(storage) ఉన్న పాలను ఎక్కువగా పిల్లలకు త్రాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి త్రాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడి పాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని(harm) కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు త్రాగించాలన్నది తెలుసుకోవాలి.

    ఇంజెక్షన్లు ఇచ్చే ఘనులూ ఉంటారు..

    పశువులు పాలివ్వటానికి ఇంజెక్షన్‌(injections) ఇస్తారు కొంతమంది పాల వ్యాపారస్తులు. ఆ ఇంజెక్షన్‌లోని రసాయనిక మందు పాలలో ప్రవేశిస్తుంది. పశువులకు వ్యాధులొస్తే, ఆ సంగతి తెలియక పిల్లలకు ఆ పాలను త్రాగించినట్లయితే పిల్లలకు అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా పసిబిడ్డకు త్రాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో, పట్టణాల్లో పశువుల పాలవాడకం తగ్గిపోయి బూత్‌పాలను ఉపయోగిస్తున్నారు. స్కిమ్డ్‌ మిల్క్‌నే అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఆ పాలల్లోంచి కొవ్వు తొలగించబడుతోంది. పిల్లలకు ఆ పాలు త్రాగించడం ఆరోగ్య కరమే. ఆ పాలల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఆ పాలల్లోంచి కొవ్వు పొర మాత్రమే తొలగిపోతుంది, పోషక పదార్థాలేమీ తొలగిపోవు. ఆ పాలల్లో ఖనిజాలు అలాగే నిక్షిప్తమై ఉంటాయి. కొవ్వు ద్వారా లభించేవి ఎ, డి విటమిన్‌(Vitamins)లు. 'ఎ' విటమిన్‌ ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది. డి విటమిన్‌ సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందుతుంది. ఆ విధంగా ఆ రెండు విటమినులను వారి శరీరానికి భర్తీ చేయవచ్చు. స్కిమ్డ్‌ మిల్క్‌లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలు పాలు త్రాగటానికి ఇష్టపడకపోతే, ఏ రూపంలోనైనా పాలతో తయారుచేసిన పదార్థాలను ఇవ్వవచ్చు. పెరుగు, మజ్జిగ, పాయసం, పాలకోవా, జున్నులాంటి ఎన్నెన్నో పదార్థాలను పాలతో తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, నూతన శక్తికీ, శారీరక దృఢత్వానికీ వారికి ప్రతిరోజూ పాలను లేదా పాలతో తయారయ్యే పదార్థాలను ఇవ్వడం ఎంతో ముఖ్యం. పసిపిల్లలకు పోతపాలు వచ్చేటప్పుడు, అవి ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు, బూత్‌పాలు ఏవయినా కానీ, పలుచని వస్త్రంలో చిటికెడు వామును వేసి మూటకట్టి, పాలను కాచేటప్పుడు, ఆ మూటను ఆ పాలల్లో వేసి కాచినట్లయితే పాపాయికి అరుగుదల బాగా ఉండి, అజీర్తి బాధలు కలుగవు. జీర్ణక్రియ బాగుంటుంది. ఆకలి కూడా బాగా ఏర్పడుతుంది. అర్థమయింది కదా.. పిల్లలకు గోరు వెచ్చని, వేడి పాలు తాగిస్తే మంచిది. అప్పుడే పిండిన పాలను అలాగే తాగించకూడదు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Children, Cow, Healthy, Life Style, MILK

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు