GIRL ADMITTED IN ICU AFTER WEARING TIGHT JEANS SKIN INFECTION SU
Dating: టైట్ జీన్స్ ధరించి డేటింగ్‌కు వెళ్లిన యువతి.. ఆ క్షణాలను ఎంజాయ్ చేయాలని అనుకుంది.. కట్ చేస్తే ఐసీయూలో..
(Image- Tiktok)
ప్రపంచంలోని చాలా మంది అమ్మాయిలు ఇతరులకు అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రెస్సింగ్ నుంచి మొదలుకుని మెకప్, ఆభరణాలు.. ఇలా ప్రతి విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు.
ప్రపంచంలోని చాలా మంది అమ్మాయిలు ఇతరులకు అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రెస్సింగ్ నుంచి మొదలుకుని మెకప్, ఆభరణాలు.. ఇలా ప్రతి విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన వ్యక్తులతో బయటకు వెళ్లే సమయాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఇక, ప్రియుడితో డేటింగ్‌కు వెళ్లే సమయంలో అమ్మాయిలు ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు. అయితే డేట్‌కు వెళ్లేటప్పుడు ఓ యువతి.. ఎంతో ప్రత్యేకంగా కనిపించాలని జీన్స్ ధరించింది. అయితే ఇది కాస్తా ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. చివరకు ఆమె ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన అనుభవాలను నార్త్ కరోనాలినాకు (North Carolina) చెందిన సామ్ అనే యువతి టిక్‌టాక్‌లో (TikTOk) పంచుకుంది. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగినట్టుగా ఆమె తెలిపింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో ( bacterial infection) బాధపడినట్టుగా
‘నేను కొత్తగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నాను. అతనితో ఒక రోజు పూర్తిగా డేట్‌కు వెళ్లాను. అయితే నేను చాలా అసౌకర్యకరమైన బట్టలు ధరించానని గ్రహించాను. నేను దానిని పట్టించుకోకుండా నా సమయాన్ని ఆస్వాదించాలని అనకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడాల్సి వచ్చింది. ఎందుకంటే నాలో అనారోగ్య లక్షణాలు కనిపించాయి. ఆ రాత్రి జీన్స్ రుద్దుకుపోయిన చోట పెద్ద గడ్డ ఉందని నేను గమనించాను. సమయం గడుస్తున్న కొద్ది అక్కడ మరింత నొప్పి పెరిగింది. ఆ బాధ నన్ను తీవ్రంగా వేధించింది.
దీంతో మరుసటి రోజు వెంటనే ఆస్పత్రికి వెల్లాను. అయితే నేను ఊహించిన దాని కంటే సమస్య చాలా పెద్దదని వైద్యులు నాతో చెప్పారు. నాకు చాలా భయం వేసింది. వణకడం మొదలైంది. ఆ బాధతో నడవలేకపోయాను. ఒంటి నొప్పులు కూడా తీవ్రంగా వేధించాయి. దీంతో వైద్యులు నన్ను ఐసీయూలో (ICU) చేర్చారు. దీంతో నేను కొంత కంగారు పడ్డారు. దాదాపు నాలుగు రోజులు ఐసీయూలో ఉన్నాను. అక్కడ వైద్యులు డీబ్రిడెమెంట్ సర్జీరీ (debridement surgery) గురించి చర్చించారు. అంటే గడ్డ ఉన్న భాగాన్ని కత్తిరించడం.
అయితే శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆమె కోలుకుంది. ఐసీయూ నుంచి క్షేమంగా బయటకు వచ్చింది. అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ( bacterial infection) తిరిగి ఆమె దరి చేరింది. కానీ ఆమెకు వైద్యులు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించారు. అయితే ఈ విషయాన్ని నా టిక్‌టాక్ ఫాలోవర్స్‌తో పంచుకోవాలని అనిపించింది’అని సామ్ తెలిపింది.
అయితే ఈ విషయం ఇంత మంది దృష్టిని ఆకర్షిస్తుందని తాను ఊహించలేదని సామ్ తెలిపింది. ఆమె వీడియోను 7.8 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. అయితే తనకు జరిగిన అనుభవమే మరికొందరికి కూడా జరిగిందని తెలుసుకుని తాను ఆశ్చర్యపోయినట్టుగా సామ్ పేర్కొంది. టిక్‌టాక్‌లో ఈ వీడియోను షేర్ చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి విచిత్రమైన, ఇబ్బందికరమైన ఘటనలు చోటుచేసుకుంటాయని, ఇందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.