హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Ginger Garlic Paste: ఈ కొలతల ప్రకారం అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది..!

Ginger Garlic Paste: ఈ కొలతల ప్రకారం అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది..!

అల్లం  - వెల్లుల్లి పేస్ట్ (Instagram)

అల్లం - వెల్లుల్లి పేస్ట్ (Instagram)

Ginger Garlic Paste: ఇంట్లోనే ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే.. దాని తయారీ విధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే సరిగ్గా ఎంత మోతాదులో వెల్లుల్లి, అల్లం అవసరమవుతాయో తెలుసుకుంటే పేస్ట్ చక్కగా వస్తుంది.

సాధారణంగా అందరి కిచెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పక ఉంటుంది. రుచి, మంచి సువాసన, ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ పేస్ట్ ని చాలా వంటకాల్లో వాడుతారు. అయితే కొందరు రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకేజీలు వాడుతుంటారు. కానీ అందులో ఆరోగ్యానికి హాని తలపెట్టే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే.. దాని తయారీ విధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే సరిగ్గా ఎంత మోతాదులో వెల్లుల్లి, అల్లం అవసరమవుతాయో తెలుసుకుంటే పేస్ట్ చక్కగా వస్తుంది. అంతేకాదు ఎక్కువ కాలం పాడుకాకుండా నిల్వ ఉంటుంది. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

* అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ విధానం

ఒక కప్ అల్లం పేస్ట్ తీసుకుంటే.. రెండు కప్పుల వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఈ కొలతల ప్రకారం మీరు ఎక్కువ మొత్తంలో కూడా అల్లం, వెల్లుల్లి పేస్ట్ తీసుకోవచ్చు. వెనిగర్ లేదా అదనపు ప్రిజర్వేటివ్స్ కు బదులు పేస్ట్‌ను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉప్పు, నూనెను వాడొచ్చు.

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు

2 కప్పుల - ఒలిచిన వెల్లుల్లి ( తాజా వెల్లుల్లి తీసుకోండి), ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక కప్పు నూనె, కప్పు తరిగిన అల్లం (శుభ్రంగా కడిగి తాజా అల్లం) తీసుకోవాలి.

* తయారీ విధానం

అల్లం, వెల్లుల్లి వాటర్ తో కడగకుండా నేరుగా గ్రైండర్ లేదా మిక్సీలో వేయండి. అలాగే అందులో ఉప్పు, నూనె కలపండి. మెత్తగా పేస్ట్ అయ్యేంతవరకు గ్రైండ్ చేయండి. తరువాత గాలి చొరబడని ఒక డబ్బాలోకి ఈ పేస్ట్ ను తీసుకోండి.









View this post on Instagram






A post shared by Kunal Kapur (@chefkunal)



ఆపై ఫ్రిజ్ లో స్టోర్ చేయండి. ఈ పేస్టును దాదాపు నెల నుంచి నెలన్నర సమయం వరకు మీరు వాడుకోవచ్చు. మీరు కావాలనుకుంటే అల్లం, వెల్లుల్లిని పైన చెప్పినట్లు వేర్వేరుగా మిక్సీ పట్టచ్చు. తరువాత ఆ పేస్టులను ఎయిర్ టైట్ కంటైనర్లలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది.

ఇది కూడా చదవండి : బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..? రూ.1 తోనే ఇన్వెస్ట్ చేసే అవకాశం.. పూర్తి వివరాలివే..!

* ఆరోగ్య ప్రయోజనాలు

గుండె జబ్బులను నివారించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో వెల్లుల్లి దివ్యౌషధంలా పనిచేస్తుంది. వాపు, జలుబు తగ్గించి.. ఆకలి వేసేలా అల్లం దోహదపడుతుంది.

First published:

Tags: Ginger, Kitchen tips, Life Style

ఉత్తమ కథలు