Home /News /life-style /

GET RID OF DANDRUFF NATURALLY WITH THE HELP OF THIS OIL UMG GH

Dandruff: మీకు చుండ్రు పెద్ద సమస్యగా మారిందా..? అయితే, ఈ ఆయిల్ ట్రై చేయండి.. బెస్ట్ రిజల్ట్ గ్యారెంటీ..!

మీకు చుండ్రు పెద్ద సమస్యగా మారిందా..?

మీకు చుండ్రు పెద్ద సమస్యగా మారిందా..?

ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల కంపెనీల హెయిర్ ఆయిల్‌ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఆలివ్ ఆయిల్(Olive Oil) జుట్టు సంరక్షణలో కీలకంగా పని చేస్తుందని, అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు సంరక్షణకు ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందంగా కనిపించేందుకు ఆరోగ్యకరమైన జుట్టు అవసరం. జుట్టు సంరక్షణకు తీసుకొనే చర్యల్లో తలకు నూనె రాసుకోవడం(Oiling) ప్రధానమైనది. ఎందుకంటే ఇది జుట్టును హీట్‌ డ్యామేజ్‌ నుంచి రక్షిస్తుంది. జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల కంపెనీల హెయిర్ ఆయిల్‌ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఆలివ్ ఆయిల్(Olive Oil) జుట్టు సంరక్షణలో కీలకంగా పని చేస్తుందని, అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్‌ ఆయిల్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఆలివ్ ఆయిల్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంట్లోని పోషకాలు హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందిస్తాయి. ఈ నూనెను క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య కూడా దూరమవుతుంది. చర్మం పొడిబారడం, ఈస్ట్ పెరుగుదల, హెయిర్ కేరింగ్ లేకపోవడం, జీవనశైలి వల్ల చుండ్రు వస్తుంది. కొన్ని రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఆలివ్ నూనెతో చుండ్రు త్వరగా దూరమవుతుంది. దీని ప్రయోజనాలు ఏవో చూద్దాం.

ఇదీ చదవండి: బరువు తగ్గాలా..? అయితే, మీ వెయిట్ లాస్‌కి తిరుగులేని చిట్కా ఇదే..!


* ఆలివ్ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

- ఆలివ్ ఆయిల్ జుట్టులో తేమను నిలుపుతుంది. చుండ్రును తగ్గిస్తుంది.

- యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆలివ్ ఆయిల్ జుట్టుకు మంచి క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది.

- ఆలివ్‌ ఆయిల్‌ శిరోజాలను బలపరుస్తుంది. మురికిని తొలగించడంలో కీలకంగా పనిచేస్తుంది.

- వెంట్రుకల చివర్లు చీలిపోయే సమస్య నుంచి కూడా ఆలివ్ ఆయిల్ ఉపశమనం కలిగిస్తుంది.

- ఆలివ్ ఆయిల్‌లో ఉన్న అసంతృప్త కొవ్వుల ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది.

- దీనిని కండీషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

- ఆలివ్ ఆయిల్‌ను రెగ్యులర్ గా ఉపయోగిస్తే ఇతర జుట్టు సమస్యలను నివారిస్తుంది.

* ఆలివ్ ఆయిల్ చుండ్రుని ఎలా తగ్గిస్తుంది?



- ఆలివ్ ఆయిల్, ఎగ్ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తలకు పట్టించాలి.

- ఆలివ్ ఆయిల్, బాదం నూనె మిక్స్ చేసి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.

- ఆలివ్ ఆయిల్‌తో నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.

- టీ ట్రీ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పని చేస్తాయి. చుండ్రును దూరంగా ఉంచుతాయి.

- చుండ్రు సమస్యను పరిష్కరించడానికి పసుపుతో ఆలివ్ నూనె కలిపి జుట్టుకు పట్టించాలి.

- ఆలివ్ ఆయిల్ కాకుండా, మంచి జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఇతర నూనెలు కొబ్బరి నూనె, బాదం నూనె, జోజోబా ఆయిల్, ఆర్గాన్ ఆయిల్ ఉన్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Dandruff, Hair fall, Hair styling, Life Style

తదుపరి వార్తలు