Wellness: హస్త ప్రయోగం చేసుకుంటే...ప్రమాదమా..ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిందే..

ప్రతీకాత్మకచిత్రం

హస్త ప్రయోగం వల్ల ప్రతికూల ప్రభావాలే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హస్త ప్రయోగం ఆరోగ్యకరమైన లైంగిక చర్యగా పేర్కొంటారు వైద్యులు.

  • Share this:
    ఈ సృష్టిలో అన్ని రకాల ప్రాణులకు శృంగారపరమైన కోరికలు కలగడం సహజమే. అయితే, పెళ్లైన వారు తమ భాగస్వామితో శృంగార కోరికలను తీర్చుకుంటారు. మరి పెళ్లి కాని వారి సంగతేంటి?.. వారికి కోరికలు ఉండవా అంటే వారికీ ఉంటాయి. అయితే, వారి కోరికలను తీర్చుకోవడానికి హస్తప్రయోగం వైపు వెళ్తుంటారు. వైద్యపరంగా చెప్పాలంటే, హస్త ప్రయోగం సాధారణ విషయమే. అయినప్పటికీ, మన సమాజంలో దీన్ని చెడ్డగా చూస్తారు. హస్త ప్రయోగానికి సంబంధించి సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలా మంది తమ యుక్త వయసులోనే హస్త ప్రయోగానికి అలవాటు పడుతుంటారు. అయితే, హస్త ప్రయోగం వల్ల వీర్యకణాలు తగ్గిపోతాయని, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని అనేక అపోహలతో సతమతమవుతుంటారు. హస్తప్రయోగంపై ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ 2011లో ‘ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్’ అనే అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హస్త ప్రయోగంపై వచ్చే అపోహలు పూర్తిగా అవాస్తవం అని దీని వల్ల ఒత్తిడి దూరమవ్వడం, ఉత్తేజం కలుగడం, హార్మోన్ల ఉత్పత్తి పెరగడం వంటి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది.

    హస్త ప్రయోగంతో కలిగే ప్రయోజనాలు
    హస్త ప్రయోగం వల్ల ప్రతికూల ప్రభావాలే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హస్త ప్రయోగం ఆరోగ్యకరమైన లైంగిక చర్యగా పేర్కొంటారు వైద్యులు. హస్త ప్రయోగం శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిదని వారు పేర్కొంటున్నారు. అంతేకాక హస్తప్రయోగంతో అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో చూడండి.

    1. హస్త ప్రయోగం చేసే సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది దీన్ని ఇష్టపడుతుంటారు.

    2. హస్త ప్రయోగం అనేది స్వయం తృప్తికి ప్రతి రూపం. దీనితో మీ లైంగిక అవసరాలు, కోరికలు ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    3. ఇది భాగస్వామితో మీ శృంగారాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే శృంగారంలో మీకు ఏది నచ్చుతుంతో తెలిస్తే, మీ భాగస్వామికి పరస్పర ఆనందానికి మార్గనిర్దేశం చేయడం సులువవుతుంది.

    4. హస్త ప్రయోగం మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. హస్తప్రయోగం మీరు మంచి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.

    5. హస్త ప్రయోగంతో నాణ్యతతో కూడిన నిద్ర లభిస్తుంది.

    6. లైంగిక ఆనందాన్ని అమితంగా ఆనందించడానికి స్వంత లేదా పరస్పర హస్త ప్రయోగం మంచి మార్గాలుగా చెప్పవచ్చు.

    7. మహిళల్లో, గర్భధారణ సమయంలో వచ్చే గర్భాశయ తిమ్మిరి నుండి ఉపశమనం పొందడానికి హస్త ప్రయోగం మంచి మార్గంగా అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. అదేవిధంగా 2019లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, నెలకు కనీసం 21 సార్లు హస్తప్రయోగం చేసిన పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 33% తగ్గిందని తేలింది.
    Published by:Krishna Adithya
    First published: