హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Winter Food: శీతాకాలం వెల్లుల్లితో ఎంతో మేలు.. ఎవరూ నమ్మలేని 8 ఆరోగ్య ప్రయోజనాలు

Winter Food: శీతాకాలం వెల్లుల్లితో ఎంతో మేలు.. ఎవరూ నమ్మలేని 8 ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips:  భారతీయ సంప్రదాయ వంటలలో వెల్లుల్లికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మసాలా కూరల్లో వెల్లుల్లి తగలకపోతే తృప్తిగా అనిపించదు.  ఇది కూరలకు మంచి రుచిని, అరోమాను అందిస్తుంది.  ముఖ్యంగా శీతాకాలంలో దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభం చేకూరుతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Winter Food: చలికాలంలో సర్వ సాధారణంగా అనారోగ్యాలు వస్తుంటాయి. పిల్లలు, పెద్దలకు శీతాకాలం రోగాల బెడద ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. భారతీయ సంప్రదాయ వంటలలో వెల్లుల్లికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మసాలా కూరల్లో వెల్లుల్లి తగలకపోతే తృప్తిగా అనిపించదు. ఇది కూరలకు మంచి రుచిని, అరోమాను అందిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభం చేకూరుతుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వెల్లుల్లి ద్వారా కలిగే లాభాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వెల్లుల్లితో రోగనిరోధక శక్తి

రుతువులను బట్టి మనం మన ఆహారంలోనూ కొద్దిపాటి మార్పులు చేసుకోవడం తప్పనిసరి. శీతాకాలంలో జలుబు, ఫ్లూ, దగ్గు, ఇన్‌ఫెక్షన్‌లలాంటివి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటాయి. ఇలాంటి సమయంలో మనలోని రోగనిరోధక శక్తిని కాపాడుకోడానికి వెల్లుల్లి(Garlic)ని మన ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Lemon Water In Winter: చలికాలంలో నిమ్మరసం తాగడం మంచిదేనా ?.. నిపుణులు ఏం చెబుతున్నారు ?

ఔషధగుణాలు ఎక్కువ

ఫేవరెట్‌ రెసిపీలలో రుచిని మరింత పెంచడానికి వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. పూర్వం భారతదేశంలో వెల్లుల్లిని ఔషధంగా వినియోగించేవారు. వింటర్‌ డైట్‌ (Winter diet)గా తీసుకునే భోజనం ఎప్పుడూ అద్బుతంగా ఉండాలి. మంచి రుచినిచ్చే హెర్బ్స్‌, స్పైసెస్‌ని అందులో చేర్చుకోవడం తప్పనిసరి. జనరల్‌ హెల్త్‌ని మంచిగా ఉంచే ఇలాంటి భోజనంలో వెల్లుల్లిది ఎప్పుడూ ముఖ్యమైన పాత్రే. పైగా ఇది చాలా అందుబాటులో ఉండే పదార్థం కూడా. దీనిలో విటమిన్లు, మినరల్స్‌, కాల్షియం, ఐరన్‌లు సమృద్ధిగా ఉంటాయి.

శీతాకాలంలో వెల్లుల్లి ప్రయోజనాలు

వెల్లుల్లిని నమలడం లేదా చూర్ణం చేసి తినడం వల్ల తెల్ల రక్త కణాల సామర్థ్యం పెరుగుతుంది. దీంతో అవి జలుబు, ఫ్లూ లాంటి వాటికి కారకాలైన వైరస్‌లతో పోరాడతాయి. ఎక్కువగా అనారోగ్యానికి గురికాకుండా చూడటమే కాకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండగల శక్తిని శరీరానికి ఇస్తుంది. బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో పని చేస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

రక్తహీనతతో బాధపడేవారికి మేలు

రక్తహీనతతో బాధపడేవారు వెల్లుల్లిన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా లాభం పొందవచ్చు. దీనిలో అల్జీమర్స్‌ని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి. మెదడు పని తీరుపై ప్రభావం చూపి అల్జీమర్స్‌ లక్షణాలను తగ్గించడంలో సహకరిస్తుంది. చలికాలంలో ఎక్కువగా గొంతు సంబంధిత వ్యాధులు వస్తుంటాయి.. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాల వల్ల ఇలాంటి సమస్యలు బాధించవు.

First published:

Tags: Health, Health Tips, Life Style, Lifestyle

ఉత్తమ కథలు