హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Ganesh Chaturthi 2020: వినాయక చవితి అసలు ప్రాశస్త్యం ఇదే..

Ganesh Chaturthi 2020: వినాయక చవితి అసలు ప్రాశస్త్యం ఇదే..

గణేష చతుర్ధి ప్రాశస్త్యం (Twitter/Photo)

గణేష చతుర్ధి ప్రాశస్త్యం (Twitter/Photo)

Ganesh Chaturthi 2020 | భారతీయుల అతి ముఖ్య పండుగలలో వినాయకచవితి ఒకటి. ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుని పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. భాద్రపదమాసం శుక్లచతుర్థి సమయంలో చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

భారతీయుల అతి ముఖ్య పండుగలలో వినాయకచవితి ఒకటి. ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుని పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ  సమయంలో  హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.పురాణాల్లో వినాయకచవితి గురించి కొన్ని కథలున్నాయి. పూర్వం గజరూపం కల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు.. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో.. ఆ రాక్షసుడు స్వామీ నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి.. అని కోరాడు. మాట తప్పని మహాశివుడి రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోకి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి.. ఎంతో బాధతో మహావిష్ణువును ప్రార్థించి.. గజాసురిని బారి నుంచి శివుడిని కాపాడమని కోరింది. దీంతో.. శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడతాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి నందిని ఆడిస్తాడు. ఆ మేళాని తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అంటూ వరమిస్తాడు.

వినాయకుడి బహుముఖ రూపాలు (Facebook/Photo)

ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి..'ఈ నందీశ్వరుడు... శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడుగుతాడు . వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు రాక్షసుడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని' వేడుకుంటాడు. అనంతరం.. విష్ణుమూర్తి సైగ చేయడంతో నంది తన కొమ్ములతో గజాసురిని చీల్చి చంపుతుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి.. దుష్టులకు ఎప్పుడూ అలాంటి వరాలివ్వొద్దంటూ నచ్చజెప్పుతాడు.

Vinayaka chavithi prayers at balapur
వినాయకుడు

వినాయక జననం

కైలాసంలో పార్వతీ దేవి.. శివుని రాక ఎదురుచూస్తూ నలుగుపెట్టుకుంటుంది. ఆ సమయంలో కిందరాలిన నలుగుపిండితో ఒక బాలుని రూపాన్ని తయారుచేసి.. ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వొద్దంటూ చెబుతుంది. అదే సమయంలో అటుగా వచ్చిన శివుడినే అడ్డుకుంటాడు ఆ బాలుడు. దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛదముగావించి లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న పార్వతీ శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో.. గజాసురిని శిరస్సుని అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించాడు శివుడు. గజముఖాన్ని పొందాడు కాబట్టి.. అతను గజాననుడిగా పేరు పొందాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి ఉద్భవిస్తాడు.

వినాయక విజయం (యూట్యూబ్ క్రెడిట్)

వినాయకచవితి..

ఒక రోజు స్వర్గలోకంలో దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరుతారు. అందుకు తామే సరైన వారిమని వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడతారు. అప్పుడు.. పరమేశ్వరుడు.. ఇద్దరికీ ఓ పరీక్ష పెడతారు. ‘మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో.. వారే ఈ పదవికి అర్హులు’ అని చెబుతాడు. దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్లిపోతాడు. వినాయకుడు మాత్రం.. తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తిచేయగలను అనే సందేహాన్ని శివుడి ముందుంచుతాడు. అపుడు శివయ్య.. తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెబుతాడు. ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే మూడు వందల కల్పాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేసినట్టవుతుందని తెలుపుతాడు. ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఆ మంత్రాన్ని ముల్లోకలములకు సమానమైన తల్లీదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు. దీంతో.. కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు.

విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి.. ‘తండ్రి, అన్న మహిమ తెలియక తప్పు చేశా.. నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి’ అన్నాడు. అలా బాధ్రపద శుద్ధ చవితిరోజున గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు.

Ganesh Chaturthi 2020, Ganesh Pandals news, Ganesh Pandals rules in Telangana, No Ganesh pandals in Khammam, వినాయక చవితి 2020, వినాయకచవితి మండపాలకు నిబంధనలు, ఖమ్మంలో వినాయక మండపాలకు నో పర్మిషన్,
ప్రతీకాత్మక చిత్రం

ఆ రోజున భక్తులందరూ భోజనప్రియుడైన వినాయకుడికి పిండివంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనే, అరటిపళ్లు ఇలా నైవేద్యం పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్నీ కార్యాల్లో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి. ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వడంతో.. వినాయకుడి పొట్టపగులుతుంది. అది చూసి పార్వతి దేవి శాపం ఇవ్వడం. ఆ తర్వాత ఋషి పత్నులు నీలాపనిందలు మోయడం. ఆ పై పార్వతి దేవి... వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు నీలాపనిందలు పాలు కారని చెబుతారు. అందుకే వినాయక చవితి రోజు.. వినాయకుని కథ చదివి, అక్షింతలు నెత్తిన వేసుకున్న వారికి ఎలాంటి నీలాపనిందలు ఉండవని చెబుతారు.

First published:

Tags: Ganesh Chaturthi 2020, Vinayaka Chavithi 2020

ఉత్తమ కథలు