• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • GANESH CHATURTHI 2020 GANESH PUJA TIME AND TIME TO PLACE GANESH JI AT HOME NK

Ganesh Chaturthi 2020: వినాయక చవితి ముహూర్తం... పూజా విధానం ఎలా ఉండాలి?

Ganesh Chaturthi 2020: వినాయక చవితి ముహూర్తం... పూజా విధానం ఎలా ఉండాలి?

వినాయక చవితి ముహూర్తం... పూజా విధానం ఎలా ఉండాలి? (credit - twitter)

Ganesh Chaturthi 2020: ఈ సంవత్సరం ఆగస్ట్ 22న వినాయక చవితి. ప్రపంచం మొత్తం ఈ పండుగ ఇళ్లలోనే జరుపుకుంటోంది. పండుగ ముహూర్తం, పూజా విధానం తెలుసుకుందాం.

  • Share this:
    Vinayaka Chavithi 2020: గణాలకు అధిపతి అయిన వినాయకుడి పండుగ వస్తే చాలు... ఇక పండుగలు మొదలైనట్లే అంటారు. ఏ పూజ చేసినా... విఘ్నాలు కలగకుండా... ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేయడం సంప్రదాయం. అలాంటిది... స్వయంగా వినాయకుడి పండగే వస్తే... ఇక భక్తకోటికి అంతకంటే ఆనందం ఏముంటుంది. ఏటా పిల్లల నుంచి ముసలివారి వరకూ... అందరూ ఈ పండుగలో పాల్గొని సకల శుభాలూ కలిగించమని ఆ బొజ్జ గణపయ్యను ప్రార్థిస్తారు. భారతదేశంలో... గణేశ్ చతుర్థిని ప్రపంచమే ఆశ్చర్యపోయే రేంజ్‌లో మహారాష్ట్రలో నిర్వహిస్తారు. ఆ తర్వాత... అదే స్థాయిలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఇక గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ పండుగను అత్యంత బాగా నిర్వహిస్తారు.

    ప్రత్యేకించి వినాయకుడి మట్టి ప్రతిమను పూజ గదిలో ఏర్పాటు చేసి... పూలు, పండ్లతో అలంకరించి... నవరాత్రి పూజలు చేయడం గణేశ్ చతుర్థి నుంచి మొదలవుతుంది. ఆ తొమ్మిది రోజులు... భక్తి గీతాలు ఆలపిస్తూ... భజనలు చేస్తూ... భక్తిభావంలో మునిగితేలుతారు ప్రజలు. అఖండ దీపం వెలిగించి... ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజలు మూడ్రోజులు, ఐదు రోజులు, 9 రోజులు, 14 రోజులు ఇలా ఎవరి తాహతును బట్టీ వారు జరుపుకుంటారు. ఇక అనంత చతుర్దశి నాడు... గణపతిని సాగనంపుతూ... శోభాయాత్రలు చేస్తారు. అలా పంపిస్తూనే... మళ్లీ వచ్చే ఏడాది రావయ్యా బొజ్జ గణపయ్యా అంటూ... గణపతి పప్పా మోరియా అంటూ... హోరెత్తిస్తారు.

    వినాయక చవితి ముహూర్తం... పూజా విధానం ఎలా ఉండాలి? (credit - twitter)


    Happy Ganesh Chaturthi:
    ఈ సంవత్సరం గణేశ చతుర్తి ఆగస్ట్ 22న శనివారం వస్తోంది. ఆ రోజు రాత్రి 7.57 వరకూ గణేశ చతుర్థి ఉంటుంది. 7.10 నుంచి హస్తా నక్షత్రం దర్శనమిస్తుంది.

    హిందూ పురాణాల ప్రకారం... ఆగస్ట్ 22న మధ్యాహ్నం 12.22 నుంచి సాయంత్రం 4.48 వరకూ అమృత గడియలు, లాభ కాలంగా చెబుతున్నారు. ఆ సమయంలో... గణేశ ప్రతిమను ప్రతిష్టిస్తే మేలంటున్నారు.

    కరోనా వైరస్ కారణంగా... ఈసారి... ఎవరికి వారు ఇళ్లలోనే పండుగ జరుపుకోనున్నారు. వినాయక చవితి నాడు చందమామను చూడకూడదనేది ఆచారం. పొరపాటున చందమామను చూస్తే... దానికి ప్రతిగా... మర్నాడు పేదలకు తెల్లటి వస్త్రాలు, తెల్లటి ఆహార పదార్థాల వంటివి ఏవైనా దానం చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు