Home /News /life-style /

FRUITS WHICH ARE UNHEALTHY FOR DIABETIC PATIENT PVN

Harmful Fruits for Diabetic : డయాబెటిక్ పేషెంట్స్ ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ప్రమాదం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Harmful Fruits for Diabetic patient : పండ్లు(Fruits)తీసుకోవడం ఆరోగ్యానికి(Health)ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. పండ్ల వినియోగం... శరీరంలోని అనేక ఖనిజాలు, ఫైబర్స్, విటమిన్ల లోపాన్ని తీరుస్తుంది. పండ్లు తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ కూడా బలంగా ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Harmful Fruits for Diabetic patient : పండ్లు(Fruits)తీసుకోవడం ఆరోగ్యానికి(Health)ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. పండ్ల వినియోగం... శరీరంలోని అనేక ఖనిజాలు, ఫైబర్స్, విటమిన్ల లోపాన్ని తీరుస్తుంది. పండ్లు తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం కోసం, పండ్లు కూడా తగినంత పరిమాణంలో తీసుకోవడం అవసరం. అయితే కొన్ని ఆరోగ్యకరమైన పండ్లను తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్ ప్రమాదంలో పడతారని మీకు తెలుసా? మధుమేహ వ్యాధిగ్రస్తులకు హాని కలిగించే పండ్లు ఏవో తెలుసుకుందాం.

హానికరమైన పండు
మెడికల్‌ న్యూస్‌టుడే ప్రకారం.. గ్లైసెమిక్ ఇండెక్స్ 70-100 మధ్య ఉండే పండ్లలో పుచ్చకాయ, అరటిపండ్లు వంటి వాటిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అధికంగా తీసుకోవడం హానికరం. ఏ పండు తినవచ్చు, మీరు ఎంత పండు తింటున్నారో అది చాలా ముఖ్యం.

అనాస పండు
పైనాపిల్‌లో షుగర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు పైనాపిల్ జ్యూస్ తాగడం మంచిది కాదు. ఒక కప్పు పైనాపిల్ జ్యూస్‌లో 14 గ్రాముల చక్కెర ఉంటుంది, కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు దీనిని తీసుకోకపోవడం బెటర్.

Women do not like these habits : మగాడిలోని ఈ ఐదు అవాలట్లు స్త్రీకి అస్సలు నచ్చవంట!

మామిడి
షుగర్ పేషెంట్లు తీపి పదార్థాలు తినడం మానుకోవాలని డాక్టర్లు చెబుతారు. ఒక డయాబెటిక్ రోగి మామిడిని తినకూడదు, ఎందుకంటే ఒక కప్పులో సుమారు 23 గ్రాముల చక్కెర ఉంటుంది, కాబట్టి ఈ పండు కూడా మీకు హాని కలిగిస్తుంది.


చెర్రీ 
చెర్రీ చాలా రుచికరమైనది, కాబట్టి దీనిని ఐస్ క్రీం, కేకులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, ఒక కప్పు చెర్రీస్‌లో దాదాపు 20 గ్రాముల చక్కెర ఉంటుంది. షుగర్ పేషంట్స్ మరియు డయాబెటిక్ పేషెంట్స్ దీనికి దూరంగా ఉండాలి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Diabetes, Diabetic

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు