Home /News /life-style /

FRANCE MAKES MENSTRUAL PRODUCTS FREE FOR STUDENTS HERES HOW OTHER NATIONS ARE FIGHTING PERIOD POVERTY MK GH

Free Sanitary products: ఫ్రాన్స్ లో వారందరికీ ఉచితంగా శానిటరీ ఉత్పత్తులు అందించనున్న ప్రభుత్వం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పీరియడ్ పావర్టీని నిర్మూలించే దిశగా ముందడుగు వేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. తమ దేశంలోని విద్యార్థినులు, యువతులకు పీరియడ్ ప్రొడక్ట్స్‌ను ఉచితంగా అందివ్వాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో టాంపూన్స్, శానిటరీ ప్యాడ్స్, శానిటరీ టవల్స్, ఇతర మెన్‌స్ట్రువల్ ప్రొడక్ట్స్‌ను ఉచితంగా అందిస్తామని ఫ్రాన్స్ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఫ్రెడరిక్ విడాల్ తెలిపారు.

ఇంకా చదవండి ...
పీరియడ్ పావర్టీని నిర్మూలించే దిశగా ముందడుగు వేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. తమ దేశంలోని విద్యార్థినులు, యువతులకు పీరియడ్ ప్రొడక్ట్స్‌ను ఉచితంగా అందివ్వాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో టాంపూన్స్, శానిటరీ ప్యాడ్స్, శానిటరీ టవల్స్, ఇతర మెన్‌స్ట్రువల్ ప్రొడక్ట్స్‌ను ఉచితంగా అందిస్తామని ఫ్రాన్స్ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఫ్రెడరిక్ విడాల్ తెలిపారు. నివాస సముదాయాలు, విద్యాసంస్థలు, యూనివర్సిటీ హెల్త్ సర్వీస్‌ల వద్ద శానిటరీ ప్రాడక్ట్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేయనున్నారు. మరిన్ని యూరోపియన్ దేశాలు కూడా ఇదే బాటలో పయనించనున్నాయి. శానిటరీ ఉత్పత్తులు కొనలేకపోవడం, టాయిలెట్లు, నీరు లేకపోవడం, పరిశుభ్రతకు దూరంగా ఉండటాన్ని పీరియడ్ పావర్టీ అంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పీరియడ్ పావర్టీని ఎదుర్కొంటున్నారని ఫ్రాన్స్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీని వల్ల యువతులు, మహిళలతో పాటు చాలా కుటుంబాల్లోని మగవాళ్లు సైతం పరిశుభ్రత పరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉచితంగా శానిటరీ ఉత్పత్తులను ఇవ్వాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఐక్యరాజ్యసమితి మెన్‌స్ట్రువల్ హైజీన్‌ను ప్రజారోగ్య, మానవ హక్కుల సమస్యగా గుర్తించింది. అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రాలేదు. ఆసియా దేశాల్లోని మహిళలు ఇప్పటికీ రుతుక్రమం సమయంలో పరిశుభ్రతకు దూరంగా ఉంటున్నారని అధ్యయనాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో చాలా దేశాలు విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. శానిటరీ ప్రొడక్ట్స్‌ను ఉచితంగా అందించిన మొదటి దేశంగా స్కాట్లాండ్ నిలిచింది. అప్పటి నుంచి పీరియడ్ పావర్టీని నిర్మూలించాలని పలువురు ప్రముఖులు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఆ తరువాత ఇంగ్లాండ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ ఉత్పత్తులను ఉచితంగా అందించే ఏర్పాట్లు చేసింది. తాజాగా న్యూజిలాండ్‌ ప్రభుత్వం కూడా ఈ జూన్ నుంచి అన్ని రకాల పీరియడ్ ప్రొడక్ట్స్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలల్లో శానిటరీ ఉత్పత్తులను ఉచితంగా అందించేందుకు చట్టాలను రూపొందించాయి.

భారత్‌ కూడా శానిటరీ ఉత్పత్తులపై గతంలో ఉన్న 12 ట్యాక్స్‌ను రద్దు చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థిణులకు వీటిని ఉచితంగా అందజేస్తున్నాయి. దేశంలో ఏటా ఒక బిలియన్ శానిటరీ వ్యర్థాలు పోగవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెన్‌స్ట్రువల్ వేస్ట్ మేనేజ్మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే మన దేశం పూర్తిగా మెన్‌స్ట్రువల్ హైజీన్‌ను సాధించడానికి మరికొంత సమయం పట్టవచ్చని ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Lifestyle

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు