హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weight Loss Tips : బరువు తగ్గాలనుకునేవాళ్లు ఇవి తినండి..ఇట్టే బరువు తగ్గిపోతారు!

Weight Loss Tips : బరువు తగ్గాలనుకునేవాళ్లు ఇవి తినండి..ఇట్టే బరువు తగ్గిపోతారు!

Fox Nuts

Fox Nuts

ఈ మధ్యకాలంలో అందరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం మీద శ్రద్ధ ఎక్కువగా పడుతున్నారు. అదే సమయంలో అధిక ఉన్నవారు కూడా బరువు తగ్గించుకునేందుకు వ్యాయామాలు,డైటింగ్ వంటి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇంకా చదవండి ...

ఈ మధ్యకాలంలో అందరిలో ఆరోగ్యం(Health) పట్ల శ్రద్ధ పెరిగింది. మంచి పోషకాలు ఉన్న ఆహారం(Food) తీసుకోవడం మీద శ్రద్ధ ఎక్కువగా పడుతున్నారు. అదే సమయంలో అధిక ఉన్నవారు కూడా బరువు తగ్గించుకునేందుకు వ్యాయామాలు,డైటింగ్ వంటి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే బరువు తగ్గించడంలో మఖానా(Fox Nuts)సహాయపడుతుందని మీకు తెలుసా. అందరూ తినడానికి ఇష్టపడే చిరుతిండి మఖానా. వీటిలో పోషక మూలకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు బయట ఏదైనా తినాలని అనిపించినప్పుడు..వాటికి బదులుగా మఖానాలను తినడం ద్వారా ఆరోగ్యకరమైన అలవాట్లను స్వాగతించినట్లవుతుంది. వీటిని కొద్దిగా నెయ్యిలో వేయించి తింటే వాటి రుచి చాలా బాగుంటుంది. మఖానా గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని తినవచ్చు. ఇందులో ప్రొటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి, ఇది ఆరోగ్యకరమైన స్నాక్‌. అయితే మఖానా బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీరు ఇటీవలే మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే, బరువు తగ్గడానికి మఖానా మీకు ఎలా సహాయపడుతుందో చూద్దాం.

బరువు తగ్గడంలో మఖానా ఎలా

32 గ్రాముల మఖానాలో దాదాపు 106 కేలరీలు ఉంటాయి. మఖానాలో కేలరీల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అవి చాలా త్వరగా కడుపుని నింపుతాయి, కాబట్టి బరువు తగ్గే ప్రారంభంలో మీ ఆహారంలో వీటిని ఖచ్చితంగా చేర్చండి.

ఇందులో ఉండే ప్రోటీన్ కారణంగా, ఇది చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉంచటానికి సహాయపడుతుంది. దీనితో అతిగా తినడం, తరచుగా తినడం నివారించవచ్చు. ఇది కోరికలను కూడా నియంత్రిస్తుందట.

వీటిలో శ్యాచ్యురేట్రెడ్ ఫ్యాట్( సంతృప్త కోవ్వు) పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి.

Walk forr fitness : వాకింగ్ తో బోలెడు ప్రయోజనాలు...ఫిట్ నెస్ కోసం ప్రతి రోజూ ఎంత నడవాలో తెలుసా

వీటిలో గ్లైసెమిక్ చాలా తక్కువగా ఉంటుంది. అవి రక్తంలో చక్కెరను నియంత్రించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

బరువు తగ్గించడమే కాకుండా, రక్తపోటు స్థాయిని తగ్గించడం వంటి అనేక విషయాలలో కూడా మఖానా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇది దంతాలు మరియు ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. వీటిలో ఉండే ఆస్ట్రింజెంట్ గుణాలు కిడ్నీలకు కూడా మేలు చేస్తాయి.

Diabetes : షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఏం తినాలి..ఏం తినకూడదు!

మఖానాలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మఖానా చాలా ఆరోగ్యకరమైనది.

వీటిని కాల్చి స్నాక్‌గా తినవచ్చు లేదా సలాడ్‌లు మొదలైన వాటికి జోడించి ఇలా తినవచ్చు.

వీటిని అన్నం, పాయసం మొదలైన వాటిలో కూడా కలపవచ్చు.

First published:

Tags: Weight loss, Weight loss tips

ఉత్తమ కథలు