Fitness : ఏ వాకింగో, జాగింగో చేసేవాళ్లు... మరీ కఠినమైన ఆహార నియమాలు పాటించకపోయినా పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు. అలాకాకుండా జిమ్‌కి వెళ్తున్నట్లైతే... ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మఖ్యంగా వర్కవుట్ సమయంలో మన బాడీ పునరుత్తేజం పొందుతుంది కాబట్టి... వర్కవుట్‌కి ముందు తినే ఆహారం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. వర్కవుట్‌ని ఎనర్జీతో చెయ్యాలంటే... స్నాక్స్ తీసుకోవడం తప్పనిసరి. తద్వారా ఎక్కువ చెమట పట్టి... బాడీలో కొవ్వు బాగా కరుగుతుంది. ఐతే... వర్కవుట్ ముందు తినే ఆహారం సరైనది కాకపోతే... మొత్తానికీ తేడా వస్తుంది. ఎంత వర్కవుట్ చేసినా వేస్టే. అందువల్ల ఈ విషయాన్ని కొద్దిగా తెలుసుకుంటే మంచిదే.
1.కార్బోనేటెడ్ డ్రింక్స్ : తియ్యగా, గ్యాస్‌తో ఉండే కూల్ డ్రింక్స్‌ని వర్కవుట్స్ ముందు తాగడం ఎంత మాత్రం మంచిది కాదు. వర్కవుట్స్ చేస్తున్నప్పుడు పొట్టలో గడబిడ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. వికారం, వామ్టింగ్స్ (వాంతులు) అయ్యేలా అనిపిస్తుంది. పైగా ఆ డ్రింక్స్‌లో పెద్ద మొత్తంలో షుగర్ ఉంటుంది. అది బాడీలో గ్లూకోజ్‌గా మారి... బరువును పెంచుతుంది. ఆ కూల్ డ్రింక్స్ బదులు... గ్లాస్ మంచినీళ్లు తాగితే ఎంతో మేలు. వర్కవుట్‌కి రెండు నుంచీ మూడు గంటల ముందు... రెండు నుంచీ మూడు గ్లాసుల నీరు తాగితే మేలు.
2. గ్లాస్ పాలు : ఉదయాన్నే ఓ గ్లాస్ పాలు తాగేసి వర్కవుట్ చేస్తుంటారు చాలా మంది. ఇది కూడా సరైన నిర్ణయం కాదంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. ఎందుకంటే పాలు తాగి వర్కవుట్ చేస్తే... అవి వెంటనే జీర్ణం కాక... పొట్టలోనే ఉండి... వికారం తెప్పిస్తాయి. వాటి నుంచీ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. వర్కవుట్ చేస్తుంటే... చాలా ఇబ్బందిగా ఫీలయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల డైరీ ఉత్పత్తులైన పాలు, వెన్న, యోగర్ట్ వంటివి వర్కవుట్ తర్వాతే తీసుకోవడం మేలు. వర్కవుట్ తర్వాత చెమట పట్టి బాగా అలసిన తర్వాత ఇలాంటివి తీసుకుంటే ఖాళీ పొట్ట నిండిన ఫీల్ కలుగుతుంది.
3. బీన్స్ : గింజలు, తృణధాన్యాల్లో ప్రోటీన్స్ ఎక్కువ. వాటిలో ఫైబర్ ఎక్కువ. అవి జీర్ణం కావడానికి టైమ్ తీసుకుంటాయి. అంతేకాదు... పొట్టలో ఉబ్బినట్లుగా కూడా చేస్తాయి. ఇలాంటప్పుడు మీరు కావాల్సిన వర్కవుట్స్ చెయ్యలేరు. కొన్ని రకాల వర్కవుట్స్ చెయ్యడం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి... బీన్స్ వంటివి తినకపోవడం బెటర్.
4. స్పైసీ ఫుడ్ : ఇది తప్పక పాటించాల్సిన రూల్. వర్కవుట్‌కి ముందు చిల్లీ నూడుల్స్ వంటివి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. స్పైసీ ఐటెమ్స్ గుండెకు చేటు చేస్తాయి. వర్కవుట్స్‌లో అసౌకర్యం కలిగిస్తాయి. పొట్టలో తేడాగా అనిపించడం ఖాయం. వర్కవుట్ అస్సలు చెయ్యబుద్ధి కాదు. అందువల్ల స్పైసీ ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే మేలు.