Zomato: పన్నీర్ బటర్ మసాల ఆర్డర్ చేస్తే... బటర్ చికెన్ ఇచ్చాడుగా..

జొమాటోకు రూ.55వేల జరిమానా విధించింది.45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించకుంటే... పదిశాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.

news18-telugu
Updated: July 6, 2019, 4:33 PM IST
Zomato: పన్నీర్ బటర్ మసాల ఆర్డర్ చేస్తే... బటర్ చికెన్ ఇచ్చాడుగా..
రేచీకటిని నిరోధిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలి లేకపోవడాన్ని నిరోధిస్తుంది. అలాగే ప్రొస్టేట్‌ రుగ్మతలను పోగొట్టి, వివిధ రకాల అంటువ్యాధులకు విరుద్ధంగా పోరాడుతుంది.
news18-telugu
Updated: July 6, 2019, 4:33 PM IST
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరోసారి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పూణెలో ఓ వ్యక్తి పనీర్ బటర్ మసాలా ఆర్డర్ చేస్తే... బటర్ చికెన్ డెలివరీ చేసింది. ఆయన ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. దీంతో బాధిత వ్యక్తి సంబంధిత రెస్టారెంట్‌కు కంప్లైంట్ చేశాడు. దీంతో ఆ యజమాని సారీ సార్ తప్పైపోయిందంటూ.. పన్నీర్ బటర్ మసాలా పంపిస్తానని మరోసారి కూడా చికెన్‌ను పంపించాడు. దీంతో సదరు వ్యక్తికి కోపం రావడంతో... అతడు స్వతహాగా లాయర్ కావడంతో కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఫుడ్ డెలివరీలో నిర్లక్ష్యం వహించి మనోభావాలు దెబ్బతీసినందుకు రూ.55వేల జరిమానా విధించింది.45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించకుంటే... పదిశాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే ముంబైకు చెందిన లాయర్ దేశ్‌ముఖ్ బాంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. పనిమీద పూణెకు వెళ్లారు. ఆరోజు ఏదో వ్రతంలో ఉన్న ఆయన అక్కడ ఓ పంజాబీ ధాబా నుంచి వెజిటేరియన్ ఫుడ్‌ అయిన... పన్నీర్ బటర్ మసాలా జొమాటోలో ఆర్డర్ చేసుకున్నారు. దీనిపై డెలివరీ బాయ్‌కు ఫోన్ చేసి అడగ్గా.. తనకేం సంబంధం లేదన్నాడు. దీంతో దేశముఖ్ రెస్టారెంట్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన యజమాని.. మిస్టేక్ అయ్యింది మళ్లీ పంపిస్తానంటూ... మరోసారి కూడా చికె‌న్‌ పంపించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దేశముఖ్... వెంటే కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టాడు. తన ధార్మిక భావనలు దెబ్బతినేలా ప్రవర్తించిన హోటల్‌తో పాటు జొమాటోపై ఫిర్యాదు చేశాడు. దీంతో దేశముఖ్ ఫిర్యాదును విన్న కోర్టు...జొమాటోతో పాటు రెస్టారెంట్‌కు నోటీసులు అందించింది.వెంటనే రూ.55 నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది. అయితే జొమాటో మాత్రం తమకెలాంటి నోటీసులు అందలేదని చెబుతోంది.


First published: July 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...