Lockdown Lessons | లైఫ్ లాంగ్ లెర్నింగ్... ఈ లాక్ డౌన్ ఆరంభం కావాలి...

ఈ లాక్ డౌన్ ఉండే 21 రోజుల్లో 21 పాఠాలు నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై కొన్ని జీవిత పాఠాలను చెబుతున్నారు.

news18-telugu
Updated: March 29, 2020, 5:49 PM IST
Lockdown Lessons | లైఫ్ లాంగ్ లెర్నింగ్... ఈ లాక్ డౌన్ ఆరంభం కావాలి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(కె.అన్నామలై, మాజీ ఐపీఎస్ అధికారి, కర్ణాటక)

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సమయంలో ప్రజలు 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ‘ఈ 21 రోజుల్లో 21 పాఠాలు’ నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై తన జీవిత పాఠాలను చెబుతున్నారు. ఆయన చెబుతున్న ఐదో పాఠం.

బెంజమిన్ ఫ్రాంక్లిన్. అమెరికా జాతి నిర్మాతల్లో ఒకరు. ‘డిక్లరేషన్ ఆఫ్ అమెరికాన్ ఇండిపెండెన్స్‌’ మీద సంతకం చేసిన సభ్యుడు కూడా. ఆయన ఓ ప్రముఖ రచయిత, ముద్రణదారుడు, రాజకీయ తత్వవేత్త, రాజకీయనాయకుడు, పోస్ట్ మాస్టర్, సైంటిస్ట్, ఇన్వెంటర్, హస్యకర్త, సామాజిక ఉద్యమకారుడు, డిప్లొమాట్. ఇన్ని భిన్నమైన రంగాల్లో అంతలా రాణించడం ఎలా సాధ్యమైందనేది మనకి ఆశ్చర్యం కలిగించే అంశం. అది కూడా జాతీయోద్యమాలు, యుద్ధాల లాంటి సమయంలో అంతటి నైపుణ్యం సాధించడం. బెంజమిన్ ఫ్రాంక్లిన్‌లోనే కాదు. ఇంకా చాలా మంది గొప్పవారిలో మనం ఇలాంటి గుణాలు చూస్తుంటాం. వారిలో ఇమిడిఉన్న గుణం ఏంటంటే జీవితాంతం నేర్చుకోవడం.

నేర్చుకోవడం అంటే మన దృష్టిలో ముఖ్యంగా చరిత్రను తెలుసుకోవడం, పునశ్చరణ. అధ్యాపకుల ద్వారా మంన ఇవి నేర్చుకుంటాం. కొంతకాలం చదువుకుని, డిగ్రీ పట్టా పొందిన తర్వాత మనం ‘ఇక వచ్చేశాం.’ అనుకుంటాం. అప్పుడు నేర్చుకున్నదాని ఆధారంగానే ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు బతికేస్తాం. ఓ రోజు మనం రిటైర్ అయిపోయి మన పిల్లలను మనల్ని చూసుకోవాలనుకుంటాం.(అవసరమైతే). అదే సమయంలో వారు కూడా అలాగే నడవాలని ఆశిస్తాం. నిజంగా నువ్వుగనుక పరిశ్రమల రంగం మీద ఉత్సాహం ఉన్న వ్యక్తివి అయితే, ఈ కోవిడ్ 19 వస్తుందని కొన్ని సంవత్సరాల క్రితమే అంచనా వేసేవాడివి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, 3డీ ప్రింటింగ్, బిగ్ డేటా, డీప్ న్యూట్రల్ నెట్‌వర్క్ మనల్ని వేగంగా ఢీకొడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా బతికిబయటపడతాం అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే, దానికి సమాధానం కోవిడ్ 19 ముగిసిన తర్వాత కానీ తెలీదు. అప్పుడు కొత్త పారిశ్రామిక విధానాలు తెరపైకి వస్తాయి. మన ఉద్యోగాలు కాపాడుకోవాలన్నా, అందులో నిపుణత సాధించాలంటూ మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఫిక్స్‌డ్ లెర్నింగ్ (ప్రస్తుతం విద్యావిధానం) నుంచి నిరంతరం నేర్చుకోవడం వైపు మళ్లాలి.

Lockdown Lessons | పిల్లల పెంపకం.. తల్లిదండ్రులకు మూడు సూత్రాలు..

జీవితానికి దారి చూపడానికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆత్మకథను మించిన గైడ్ మరొకటి దొరకదు. తాను తెలుసుకోవాలనుకున్న దాని గురించి ఆయన రోజూ నిద్రలేవగానే ఓ గంటపాటు అందుకోసం కేటాయించేవారు. అది చదవడం కావొచ్చు. రాయడం కావొచ్చు. లేకపోతే పరిశోధన అయిఉండొచ్చు. అందుకే ఫ్రాంక్లిన్ విభిన్న రంగాల్లో నిపుణత సాధించగలిగారు. ఆయన నేర్చుకున్నవన్నీ ఆయన జీవితకాలంలో ఎక్కడో ఓ చోట అవసరం అయ్యాయి. ఆయన్ను గొప్ప రాజనీతిజ్ఞుడిగా మార్చాయి.
అలాంటి అలవాట్లే మనకు గొప్పగొప్ప వారిలోకనిపిస్తూ ఉంటాయి. వారిని వారు మరింత మెరుగుపరుచుకోవడం, కొత్తగా నేర్చుకోవడం, కొత్త కొత్త అలవాట్లు చేసుకోవడం లాంటివి. 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా వారిలో ఇలాంటి నేర్చుకునే తత్వం పోదు. వారి జీవితం ఒక దగ్గరే ఉండిపోవడాన్ని వారు అంగీకరించరు. ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలన్ మస్క్ తన 40 ఏళ్ల తర్వాత విభిన్న రంగాల్లోకి ప్రవేశించారు. రాకెట్ సైన్స్, ఇంజినీరింగ్, ఫిజిక్స్, సోలార్ పవర్, ఎనర్జీ లాంటి భిన్న రంగాల్లో అడుగుపెట్టి విజయం సాధించారు.రిలేషన్ షిప్.. టైం.. ఈ రెండూ జీవితాన్ని నేర్పిస్తాయి..

ఈ లాక్‌డౌన్‌ని ఎలా ఎలా సద్వినియోగం చేసుకోవాలి?
ఈ లాక్ డౌన్‌ని రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు. ఎంజాయ్ చేయడానికి వచ్చిన బ్రేక్. లేకపోతే పురోగతి సాధించడానికి వచ్చిన బ్రేక్. ఎంజాయ్ చేయాలంటే మనం గతంలో తక్కువగా చేసిన వాటిని ఇప్పుడు ఎక్కువగా చేయొచ్చు. టీవీ చూడడం, డొనాల్డ్ ట్రంప్ జుట్టు రంగు గురించి ఛలోక్తులు, రోడ్డు మీద పోలీసులు ఎవర్నో కొడుతున్నారు చూడంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

ఇక కష్టమైన పని ఏంటంటే, ప్రశాంతంగా కూర్చుని, మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఇప్పుడు జీవిస్తున్నదాంతో నేను సంతోషంగా ఉన్నానా? ఎంతకాలం ఇలా బయటి శక్తులు నా మీద పెత్తనం చేయడానికి అనుమతించాలి? దేవుడు నాకు ఇచ్చిన అద్భుత అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నానా? ఒకసారి ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే. ఆ తర్వాత మనం మొదలు పెట్టవచ్చు. ఇక్కడ ఆప్షన్ A కంటే ఆప్షన్ B బెటర్ లాంటిదేమీ ఉండదు. నీ జీవితంలో నుంచి నీకు ఏం కావాలనుకుంటున్నావనేదే ముఖ్యం.

సవాళ్లే విజయానికి సోపానాలు... కరోనా కూడా అంతే 

మీ జీవితంలో పురోగతి సాధించడానికి దక్కిన సదవకాశంగా ఈ లాక్‌ డౌన్‌ని చూడాలని నేను సలహా ఇస్తా. చదువుదాం అని కొని పక్కన పెట్టేసిన బుక్స్ అయి ఉండొచ్చు, ఎప్పటి నుంచో నేర్చుకుందా అనుకుంటున్న ఓ హాబీ అయి ఉండొచ్చు, యోగాసనాలు, యోగ క్రియలు కావొచ్చు. ఏదైనా ఆన్‌లైన్లో నేర్చుకోవచ్చు. మీలో కొందరు సినిమా రచయితలు కూడా అవ్వొచ్చు. ఇన్నాళ్లూ మీ గురించి మీ కంటే మిగిలిన వారికి భయపడుతూ పక్కన పడేసిన పెన్ను, పేపర్ చేతపట్టండి. మీరు డైరెక్ట్ చేయాలనుకుంటున్న సినిమాకి కథ, స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ప్రారంభంలో మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులో సందేహం లేదు. ఆ తర్వాత మీరు అందులో లీనం అయిపోతారు. మీకు తెలియకుండానే మీలో రెండో భాగం అయిపోతుంది. ఈ సమయంలో మనం తీసుకునే చర్యలు మన జీవితాన్ని మార్చేయొచ్చు. అలాగే, జీవితాంతం మనలో భాగం కూడా అయిపోవచ్చు. మన నిజ జీవితం (లాక్ డౌన్ తర్వాత) ప్రారంభమైనప్పుడు మన జీవితాన్ని రీస్టార్ట్ చేయగలం. మనం కొత్తగా ఎంచుకున్న దాని కోసం మన ఉదయంలో తొలి గంటను కేటాయించగలం.

రండి .. లాక్ డౌన్ 21 రోజుల్లో 21 పాఠాలు నేర్చుకుందాం

అన్నిటికంటే ముఖ్యంగా, ఈ సత్యాన్ని గమనించండి. మనం నెలకు కొన్ని వందల రూపాయలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కోసం ఖర్చు పెట్టినప్పుడు, కొన్ని వేల రూపాయలు దుస్తుల కోసం ఖర్చు చేసినప్పుడు, టేక్ అవేస్ మీద మరికొన్ని వేలు ఖర్చు పెట్టినప్పుడు, మన జీవితంలో కొత్తగా నేర్చుకోబోయేదాని మీద మనం పెట్టుబడి పెట్టడాని ఎందుకు రెండోసారి ఆలోచించాలి. ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వీణ వాయించడంలో నిష్ణాతులు. ఆయన పొద్దున్నే లేచి వీణ వాయిస్తూ తనను తాను స్టడీ చేసుకునేవారు. ఆయనలోని క్రియేవిటీని బయటకు రావడానికి అది ఉపయోగపడేది. అల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా వయోలిన్ అభిమాని. తనను తాను తెలుసుకోవడానికి ఆయన వయొలిన్‌ను ఆశ్రయించేవారు. కొన్ని కొన్ని సార్లు మన రెండో ప్రాధాన్యతలు మన మొదటి ప్రాధాన్యతలు ఉన్నతంగా సాగడానికి దోహదం చేస్తాయి.

రండి మీ వీణ, వయోలిన్‌లను గుర్తించడానికి ఇదే సరైన సమయం. త్వరగా.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading