Home /News /life-style /

FORGETTING EVERY LITTLE THING THEN EAT THESE AND IT WILL REDUCE FORGETFULNESS PRV

Health tips: ప్రతి చిన్న చిన్న విషయాన్ని మరిచిపోతున్నారా? వీటిని తినండి.. మతిమరుపుకు చెక్​ పెట్టండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బిజీ లైఫ్​ కాబట్టి ప్రతీ చిన్న చిన్న విషయం మరిచిపోతుంటాం (forgot). ఆ చిన్న చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను (lives) శాసిస్తుంటాయి కూడా. అలాంటి తప్పిదాలే (mistakes) మన జీవితాలనూ ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్న వారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్ (better)​ అంట.

ఇంకా చదవండి ...
    పల్లీలు (peanuts). ఆరోగ్యం కోసం చాలా మంచివి. ఎందుకంటే ఇప్పుడు రోజురోజుకూ చలి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్‌లా పని చేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ (Minerals) కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలోరీలు ఉంటాయి. దీన్నిబట్టి పల్లీలు శరీరానికి (body) ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీలలో మోనోసాచురేటెడ్, పాలీ సాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీల లో అధికంగా ఉండే ఒలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలు నివారిస్తుంది.  ఆరోగ్యం (health) మెరుగుపడుతుందని ఇప్పటివరకు చేసిన ఎన్నో పరీక్షలలో నిరూపితమయ్యింది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడుతాయట. అదేంటో తెలుసుకుందాం..

    మతిమరుపు సమస్యలకూ..

    బిజీ లైఫ్​ కాబట్టి ప్రతీ చిన్న చిన్న విషయం మరిచిపోతుంటాం (forget). ఆ చిన్న చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను (lives) శాసిస్తుంటాయి కూడా. అలాంటి తప్పిదాలే (mistakes) మన జీవితాలనూ ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్న వారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్ (better)​ అంట.

    పల్లీలలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపకశక్తి (memory) పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు (Forgetfulness) సమస్యలతో బాధపడేవారు రోజుకి గుప్పెడు పల్లీలు (peanuts) తినండి. ఇక జ్ఞాపకశక్తి పెరుగుతుందట (Increase memory). పల్లీలలో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీల లో కాలుష్యం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి.

    పల్లీల వల్ల ప్రయోజనాలు..

    పచ్చి పల్లీలు, వేయించిన, ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు... ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఇ, నియాసిన్ లతోపాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీల లో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీలలో పుష్కలంగా ఉండటం వలన అవి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వలన గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

    పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం..కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే  నీళ్లు తాగ‌వ‌ద్దూ అని అంటుంటారు. మ‌రి ఎందుకు తాగ‌కూడ‌దు అన్న ప్ర‌శ్న వ‌చ్చే ఉంటుంది. దీనికి మూడు కార‌ణాలు ఉన్నాయి. మొద‌టిది.. ప‌ల్లీల్లో  ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. రెండోవ‌ది.. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావ‌ట‌.  దీని వ‌ల్ల‌ గ్యాస్, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health Tips, Heart Attack, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు